ఆంధ్రప్రదేశ్ లో రీ-పోలింగ్ కు ఈసీ పచ్చజెండా…
ఆంధ్రప్రదేశ్ లో రీ-పోలింగ్ కు ఈసీ పచ్చజెండా… మే 6న రీ-పోలింగ్… ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది…
ఏప్రిల్11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో… ఈవీయం లు పనిచేయకపోవడం, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న 5 పోలింగ్ కేంద్రాలలో… మే 6న రీపోలింగ్ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించిందని, ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి జీ.కె.ద్వివేది ప్రకటించారు.
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలోని ఐదు చోట్ల రీ-పోలింగ్ నిర్వహించాల్సిందిగా గతంలో ఆయా జిల్లా కలెక్టర్లు ఎన్నికల సంఘానికి నివేదించారు.
గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కేసానుపల్లి, 94వ బూత్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నల్లచెరువులోని 244వ బూత్, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పల్లెపాలెం గ్రామం ఇసుకపల్లి 41వ బూత్ లో అదేవిధంగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని అటకానితిప్ప 197వ పోలింగ్ బూత్, యర్రగొండపాలెం నియోజకవర్గంలోని కలనూతలలో 247వ పోలింగ్ కేంద్రంలో.. మే 6న రీ-పోలింగ్ నిర్వహిస్తామని ద్వివేది పేర్కొన్నారు.