ముఖ్య అర్చకుడు కోట నాగవెంకట వరప్రసాద్ కొద్ది సేపటి క్రితం మరణించారు.
పశ్చిమగోదావరి జిల్లా పంచారామా క్ష్రేతం..
పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి వారి దేవస్థానంలో ఉప ముఖ్య అర్చకుడు కోట నాగవెంకట వరప్రసాద్ (నాగబాబు) కొద్ది సేపటి క్రితం మరణించారు.
కార్తీక సోమవారం సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు.
నాగబాబు పూజా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఏమయ్యిందో ఏమో గాని..
హఠాత్తుగా కుప్పకూలిపోయారు.
హుటాహుటీన స్థానిక రాజీవ్ హస్పటల్ కి తరలించారు. అయితే అప్పటికే నాగబాబు మృతి చెందినట్టు వైద్యులు దృవీకరించారు.