ప్రత్యర్ధితో కేంద్ర మంత్రి మేనకా గాంధి వాగ్వాదం….


కేంద్ర మంత్రి, ఉత్తర ప్రదేశ్ లోని సుల్తాన్‌పూర్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మేనకాగాంధీ… తన ప్రత్యర్థి సోనూ సింగ్‌ల మద్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది…

పిలీభీత్‌ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న మేనకాగాంధీ ఈ ఎన్నికల్లో సుల్తాన్‌పూర్‌ నుంచి బరిలో నిలిచిన సంగతి తెలసిందే. అయితే ఆ స్థానం నుంచి ఎస్పీ, బీఎస్పీ కూటమి తరఫున సోనూ సింగ్‌ బరిలో ఉన్నారు. ఆరో విడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఆదివారం ఉదయం పోలింగ్‌ ప్రారంభం అయింది.

నియోజకవర్గంలోని పలు పోలింగ్‌ బూతులను పరిశీలిస్తున్న మేనకాగాంధీ.. ఎస్పీ, బీఎస్పీ నాయకులు ఓటర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

మీ రౌడీయిజం ఇక్కడ పని చేయదని సోనూ సింగ్‌ను ఉద్దేశించి మేనకాగాంధీ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను ఖండించిన సోనూ సింగ్‌ తాను ఏ తప్పు చేశానో చెప్పాలంటూ మేనకాగాంధీని ప్రశ్నించారు. ఈ సమయంలో సోనూ సింగ్‌ అనుచరులు ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సోనుసింగ్ తన కార్యకర్తలకు సర్దిచెప్పి, అక్కడి నుంచి వెళ్లిపోవడంతో గొడవ సద్దుమణిగింది.

నేను నియోజకవర్గంలోని పోలింగ్‌ బూత్‌ల పరిశీలనలో భాగంగా ఇక్కడికి వచ్చాను. పోలింగ్‌ సక్రమంగా జరుగుతుందో లేదో తెలసుకోవడం ఎలాంటి నేరం కాదు. సోనూ సింగ్‌తో ఉన్నవారిలో ఒక వ్యక్తి జైలు నుంచి పారిపోయి పరారీలో ఉన్నాడు. అలాంటి వ్యక్తులు ఓటు వేసే ముందు ఓటర్లను భయపెడుతున్నారు. ఇది సరియైన పద్ధతి కాదు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో ఓటు వేసే హక్కు ఉంది అంటూ… మేనకా గాంధీ తెలిపారు.

అయితే… ఏప్రిల్ 12వ తేదీన సుల్తాన్‌పూర్‌లోని ముస్లింల ఆధిక్యత ఉన్న తురబ్ ఖానీ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మేనకా గాంధీ పాల్గొని, ముస్లింలు తనకు ఓటు వేయకుంటే వారికి ఉద్యోగాలు ఇచ్చేది లేదని అన్నారు. ఓటు వేయకుండా ఉద్యోగాలు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఇది ఇచ్చి పుచ్చుకునే పద్ధతి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ వ్యాఖ్యలకు గాను, ఈసీ మేనకా గాంధి పై 48గంటల ప్రచార నిషేధాన్ని విధించిన సంగతి గమనార్హం.

About The Author