సుప్రీంకోర్టు చరిత్రలో… అద్భుత ఘట్టం… వెకేషన్ బెంచ్ లో ప్రధాన న్యాయమూర్తి…
సుప్రీంకోర్టు చరిత్రలో… అద్భుత ఘట్టం… వెకేషన్ బెంచ్ లో ప్రధాన న్యాయమూర్తి…
సుప్రీంకోర్టుకు మే 13 నుండి జూన్ 30 వరకు వేసవి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే…
అయితే.. అత్యవసర వ్యాజ్యాల విచారణకు ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈ నెల 25 నుండి 30 వరకు ఏర్పాటు చేసిన వెకేషన్ బెంచ్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ భాగస్వామ్యం కానున్నారు. వెకేషన్ బెంచ్‌లో ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షత వహిచడం సుప్రీంకోర్టులో గతంలో ఎన్నడూ చోటు చేసుకోలేదు.
ఈ నెల 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి, అనంతరం ప్రభుత్వ ఏర్పాటులో ఒకవేళ వివాదాలు తలెత్తితే… అవి వెకేషన్ బెంచ్ పరిశీలనకు వస్తాయి. ఈ నేపథ్యంలో మే 25 నుండి మే 30 వరకు జస్టిస్ రంజన్ గొగోయ్, ఎంఆర్‌షా ల ధర్మాసనం పనిచేస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది.
గత ఏడాది మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడం, అనంతరం బిజెపిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించడం, ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ జెడిఎస్-కాంగ్రెస్‌ల కూటమి సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే….
అప్పట్లో ఈ వివాదంపై సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్ విచారణ చేపట్టి, అప్పటి ముఖ్యమంత్రి యడ్యూరప్ప అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఇచ్విన తీర్పు… ఆ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్నే మార్చివేయడం గమనార్హం.
వేసవి సెలవులలో పనిచేసే ధర్మాసనాలు:
* ఈ నెల 13 నుండి 20 వరకు జస్టిస్ ఇందిరా బెనర్జీ, సంజీవ్
ఖన్నాలతో కూడిన ధర్మాసనం
* మే 21 నుండి 24 వరకు జస్టిస్ అరుణ్ మిశ్రా, ఎంఆర్ షా
ధర్మాసనం
* మే 25 నుండి మే 30 వరకు జస్టిస్ రంజన్ గొగోయ్,
ఎంఆర్‌షా ధర్మాసనం
* మే 31 నుండి జూన్ 2 వరకు జస్టిస్ ఎల్.నాగేశ్వర రావు,
ఎంఆర్‌షా ధర్మాసనం
* జూన్ 3 నుండి 5 వరకు జస్టిస్ ఇందు మల్హోత్రా, ఎంఆర్‌షా
ధర్మాసనం
* జూన్ 6 నుండి 13 వరకు జస్టిస్ ఇందిరా బెనర్జీ, అజరు రస్తోగి
ధర్మాసనం
* జూన్ 14 నుండి 30 వరకు పనిచేసే ధర్మాసనాల వివరాలను
తరువాత వెల్లడిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది.