నాగచైతన్య – సమంత పెళ్లి తర్వాత జంటగా నటిస్తున్న సినిమా….
నాగచైతన్య – సమంత పెళ్లి తర్వాత జంటగా నటిస్తున్న సినిమా గత నెలలోనే ప్రారంభం అయిన విషయం తెల్సిందే. గత నెలలో మొదటి పెళ్లి రోజు జరుపుకున్న ఈ జంట ఆ తర్వాత ‘మజిలి’ చిత్రీకరణ మొదలు పెట్టారు. అంతకు ముందే వీరిద్దరు లేకుండా కొన్ని సీన్స్ ను దర్శకుడు శివ నిర్వాణ చిత్రీకరించినట్లుగా వార్తలు వచ్చాయి. మొన్నటి వరకు వైజాగ్ – సింహాచలం ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం యూనిట్ సభ్యులు అక్కడ షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చేశారట. వైజాగ్ – సింహాచల్ షెడ్యూల్ పూర్తి అవ్వడంతో సినిమా దాదాపుగా 40 శాతం పూర్తి అయ్యిందట.రేపు అంటే నవంబర్ 23న నాగచైతన్య పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి ‘మజిలి’ అంటూ ప్రచారం జరుగుతుంది కాని ఇప్పటి వరకు చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. రేపు ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత టైటిల్ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సినిమా మొదలై కనీసం నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే ఫస్ట్ లుక్ ను విడుదల చేయడంతో పాటు – 40 శాతం చిత్రీకరణ పూర్తి చేయడం ఆశ్చర్యంగా ఉంది. దర్శకుడు శివ నిర్వాణ పక్కా ప్రణాళికతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడట.ఈనెల 26 నుండి హైదరాబాద్ లో తదుపరి షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. వచ్చే నెలలోనే ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంను ఇంత స్పీడ్ గా తెరకెక్కిస్తున్న దర్శకుడు క్వాలిటీగా తీస్తున్నాడా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాస్త స్పీడ్ తగ్గించి క్వాలిటీపై దృష్టి పెట్టమని అక్కినేని ఫ్యాన్స్ కోరుతున్నారు.