ఆర్థిక శాఖపై సీఎం జగన్ సమీక్ష సమాచారం…
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనపై పట్టు సాధించేందుకు అధికారిక సమీక్షలకు శ్రీకారం చుట్టారు. ఇవాళ ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాయలంలో ఆర్థికశాఖ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వనరులు, చేపట్టాల్సిన సంస్కరణలపై అధికారులతో చర్చిస్తున్నారు..
ఆర్థిక శాఖతో పాటు ఆదాయవనరులు సమకూర్చే శాఖలపై కూడా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, ప్రత్యేక కార్యదర్శులు సాంబశివరావు, పీవీ రమేష్ , ఆర్థిక శాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ , సీఎం కార్యదర్శి ఆరోఖ్యరాజ్ , అదనపు కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, తదితరులు సమీక్షకు హాజరయ్యారు.
సమీక్ష అనంతరం ఇవాళ మధ్యాహ్నం సీఎం హైదరాబాద్ వెళ్లనున్నారు. రాజ్ భవన్ లో ఇవాళ గవర్నర్ ఇఫ్తార్ విందు ఇవ్వనున్న నేపథ్యంలో జగన్ హాజరుకానున్నారు. ఈ నెల 8న ఉదయం 11.39గంటలకు సచివాలయం వద్ద మంత్రివర్గ ప్రమాణస్వీకారం ఉండనుంది.