టీ.టీ.డి బోర్డు రద్దుకు సర్వం సిద్ధం…

టీటీడీ బోర్డు రద్దుకు ఫైల్ కదిలింది..
======================
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ ని రద్దు చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. మూడు నాలుగు రోజుల్లో టీటీడీ నిబంధనల్లోని 135 ప్రకారం బోర్డ్ రద్దుకు ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. ఎండోమెంట్ కమిషనర్ సిఫార్సు మేరకు ప్రభుత్వం నిర్దిష్ట కారణాలపై టీటీడీ బోర్డ్ ని రద్దు చేయొచ్చు. ప్రస్తుతం పుట్టా సుధాకర్ యాదవ్ చైర్మన్ గా ఉన్న బోర్డు ఏడాది కాలానికి రెండో దఫా పదవిలో ఉంది. సాధారణంగా అయితే రాష్ట్ర ప్రభుత్వాలు మారినప్పుడు తమ బోర్డు ఏర్పాటు చేసిన ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయినప్పుడు టీటీడీ బోర్డు సభ్యులు రాజీనామా చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇప్పుడు ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ తాను రాజీనామా చేయనని, అది తన సెంటిమెంట్ అని అందువల్ల ప్రభుత్వం తనను తొలగించుకోవచ్చని చెప్పారు. ఆయన వాదన ఎలా ఉన్నా టీటీడీ బోర్డుని రద్దు చేసేందుకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది…

About The Author