Question : ఆలయాల్లో దేవుళ్ళకు కడవల తో పాలు పోస్తుంటారు. అన్ని పాలు వృధా చేయడం కంటే పేదలకెందరికో పంచవచ్చు కదా!

ప్ర: ఆలయాల్లో దేవుళ్ళకు కడవలతోపాలు పోస్తుంటారు. అన్ని పాలు వృధా చేయడం కంటే పేదలకెందరికో పంచవచ్చు కదా!

 

Answer :  ‘పారబోస్తే’ వృధా అంటారు కానీ ‘అభిషేకిస్తే’ వ్యర్థం కాదు. దేవుడు అంటే విశ్వకారక దివ్య శక్తి. ఆ భావంతో మంత్రపూత విగ్రహాన్ని అభిషేకిస్తే అది పుష్టినిస్తుంది. చెట్లు మొదల్లో నీరు పోస్తే చూడడానికి పారబోసినట్లు కనిపించవచ్చుగానీ అది మూలం ద్వారా చెట్టంతటికీ పుష్టినిస్తుంది. కొమ్మలలో పువ్వులు కావాలంటే మూలానికి నీరు పోసినట్లే, ప్రపంచ క్షేమం కోసం భగవంతుని ఆరాధిస్తాం.
కేవలం మనిషి తాగడమే సార్థకం అనుకోవడం అవివేకం. ఆ మాటకొస్తే మనిషి నోట్లో పోసి వృధా చేసేకంటే దూడచేత తాగిస్తే మేలు అనుకోవచ్చు కదా!
నమ్మకం లేని వాళ్ళు వృధా అనుకోవచ్చు. శాస్త్రాన్నీ, దైవాన్నీ నమ్మేవారికి అది వ్యర్థం కాదు. ఒక యజ్ఞం, ఒక ఆలయంలోని దేవతారాధన – లోకానికి క్షేమం కలిగించడం నేటికీ చూస్తూనే ఉంటాం

About The Author