హైదరాబాద్: గత నెలలో హత్యకు గురైన ఆటోడ్రైవర్‌ సాయినాథ్‌ కుటుంబాన్ని ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం అన్యాయమని తెలంగాణ ఆటోడ్రైవర్స్‌ జేఏసీ కన్వీనర్‌ మహ్మద్‌ అమానుల్లాఖాన్‌ అన్నారు. మద్యం మత్తులో ఆటోడ్రైవర్‌ను హత్య చేయడంతోపాటు పెట్రోల్‌ పోసి ఆటోను ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

మంగళవారం హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆటోడ్రైవర్లు తమవంతుగా సాయినాథ్‌ ఫ్యామిలీ ఫండ్‌ పేరుతో చందాలు వసూలు చేసి ఈనెల 25న ఆయన కుటుంబానికి అందించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

ఆటోడ్రైవర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 25న రాష్ట్రవ్యాప్త ఆటోబంద్‌కు పిలుపునిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈసమావేశంలో ఆటోడ్రైవర్ల జేఏసీ నాయకులు వంశీ కృష్ష, మహ్మద్‌ రఫీక్‌, కె.లక్ష్మీనర్సయ్య, ఎంఎ.సలీం, మహ్మద్‌ ఆజీముద్దీన్‌, మహ్మద్‌ లతీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

About The Author