వైద్య పరికరాలు, మందుల నిల్వ అవసరాలు గుర్తించండి – జిల్లా కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాల మరమ్మతులు, కొనుగోలు కనీసం 3 నెలలకు సరిపడా మందులు అందుబాటులో వుండేలా చూడాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్ భరత్ గుప్తా వైద్య అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం ఆసుపత్రుల అభివృద్ది కమిటీ అధికారులతో ఎస్.వి.మెడికల్ కళాశాల, రుయా , ప్రసూతి ఆసుపత్రులను అవసరాలను జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రస్తుతం వున్న వైద్య పరికరాలను మరమ్మతు చేయడం లేదా కొత్తవి కొనుగోలు చేయడం పై వెంటనే దృష్టి పెట్టి నివేదిక సిద్దం చేయాలని సంబంధిత ఆసుపత్రుల సూపరింటెండెంట్స్ ను ఆదేశించారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్ లో అవసరమైన అన్ని రకాల మందులు కనీసం 3 నెలలకు సరిపడా అందుబాటులో వుండాలని, వాటి ఎక్స్ పైరీ తేదీలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని సూచించారు. మందులు కొరత వల్ల ఆరోగ్యశ్రీ లో చికిత్స చేసుకునే వారు బయటి నుండి మందులు తెచ్చి ఏం.ఆర్.పి.రేట్లు పొందే అవకాశంవుందని టెండర్ అయితే దాదాపు 50 శాతం మిగులుకు అవకాశం కలిగి మరికొంత మందికి మందులు అందుబాటులోకి వస్తాయని సూచించారు. దాతలు అందించే వైద్య పరికారాలకు ఐ. టి. 80జి వెసులుబాటుకు దరఖాస్తు చేయాలని ఇన్ కం టాక్స్ వెసులు బాటు వుంటే దాతలు ముందుకు వచ్చే అవకాశం వుందని సూచించారు. ఆసుపత్రులలో సిబ్బంది, డాక్టర్ ల విషయం లో కొరత వుంటే నిర్దేశించి పోస్టుల మేరకు అనుమతి తీసుకొని అవుట్ సోర్సింగ్ లేదా నియామకం చేపట్టాలని సూచించారు. రుయా బ్యాటరీ వాహనం మరమ్మతు చేయాలని, ప్రసూతి ఆసుపత్రికి బ్యాటరీ వాహనం కొనుగోలు చేయాలని రొగులు తరలింపుకు అనువుగా వుంటుందని సూచించారు. టి. టి. డి. ద్వారా త్రాగునీరు ఏర్పాటుకు జలప్రసాదం పథకం కోరడం జరుగుతుందని తెలిపారు. వైద్య పరికరాల కొనుగోలు విషయంలో వీలైనంత వరకు మొబైల్ ఎక్వెప్ మెంట్ కు ప్రాధాన్యం ఇవ్వాలను సూచించారు. అర్థో, పీడియాట్రిక్, కార్డియాలజీ విభాగాలను సమీక్షించి తక్షణం అవసరాలు గుర్తించి ప్రతిపాదన సిద్దం చేయాలని సూచించారు. ఇక్కడి నుండి చాలా మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు డెప్యుటేషన్ పై వివిధ ప్రాంతాల్లో వున్నారని, ఇక్కడ అవసరమని కోరగా డేప్యుటేషన్ రద్దు కు వివరాలు సమర్పించాలని కోరారు. అనంతరం ఎస్. వి. వైద్య కళాశాల పర్యటించి, విద్యార్థులతో సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సమావేశం లో ఎస్ వి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. రవిప్రభు ,సూపరింటెండెంట్లు రుయా సిద్ద నాయక్, ప్రసూతి ఆసుపత్రి డా. భవానీ, ఆర్ ఎం ఓ శ్రీహరి, సి ఎస్ ఆర్ ఎం ఓ డా. ఆర్ ఆర్ రెడ్డి, డి సి హెచ్ ఎస్ డా. సరళమ్మ, ఏ పి ఏం ఇ డి సి ఇంజనీర్ ధనంజయ రెడ్డి, వివిధ విభాగాల డాక్టర్లు పాల్గొన్నారు.

About The Author