వనపర్తి లో కాంగ్రెస్ నేతల భారీ మద్యం డంపు స్వాధీనం…
https://www.youtube.com/watch?v=8Ux-EehexWU
వనపర్తి లో కాంగ్రెస్ నేతల భారీ మద్యం డంపు స్వాధీనం:
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరు స్టేజి సమీపంలోని జేఏం ఫార్మ్స్ లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 20 లక్షల మద్యం స్వాధీనం. 699 కార్టూన్లలో 33552 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. వాచ్మెన్ కాశన్న చెప్పిన మేరకు పెద్దమందడి మండల కాంగ్రెస్ నాయకుడు సత్యా రెడ్డి ఈ మద్యాన్ని గోదాంలో డంపుచేశారు. వనపర్తి మహకూటమి అభ్యర్ధి చిన్నారెడ్డి కోసం ఈ డంపు దాచి వుంచినట్లు సమాచారం. వనపర్తి డీఎస్పీ సృజన సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి చేరుకుని మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు