రోహిత్ శర్మ తల్లి గారు పూర్ణిమ శర్మ మన తెలుగింటి ఆడపడుచు…
రోహిత్ శర్మ తల్లి గారు పూర్ణిమ శర్మ మన తెలుగింటి ఆడపడుచు . ఆమె స్వస్థలం విశాఖపట్నం ……
తండ్రి పేరు గురునాధ్ శర్మ , ఆర్ధికంగా దిగువ మధ్యతరగతి కి చెందిన వ్యక్తి . ఒక ట్రాన్స్ పోర్ట్ సంస్థ కి చెందిన గోడౌన్ లో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకున్నారు.
తమ పేదరికం కారణం గా …..చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల దగ్గర తక్కువగా ఉంటూ , తన తాత గారి దగ్గర , మామయ్యల దగ్గర పెరిగి పెద్దవాడయ్యాడు . స్కూలు లో కోచ్ కల్పించిన స్కాలర్ షిప్ తో చదువు కొనసాగిస్తూ , క్రికెట్ లోని ఓనమాలు నేర్చుకున్నాడు.
అన్ని కష్ట నష్టాలను ఓర్చుకొని , ఇప్పుడు భారతదేశం గర్వించే స్థాయికి , క్రికెట్ ప్రపంచం తనవైపుకు చూసే స్థాయికి ఎదిగాడు.