భారత్ లోనే 2023 క్రికెట్ ప్రపంచకప్…


వచ్చే వన్డే ప్రపంచ కప్‌ను మాత్రం భారత్‌లో నిర్వహించనున్నారు. 2023లో జరగనున్న ఆ ప్రపంచకప్ పూర్తిగా భారత్‌లోనే జరగనుంది. అంతకు ముందు 1987, 1996, 2011లో భారత్ వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చినా.. పొరుగు దేశాలైన పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు కూడా ఆతిథ్యం పంచుకున్నాయి.

ఈ క్రమంలో 2023లో జరగనున్న ప్రపంచకప్ మ్యాచ్‌లన్నింటినీ పూర్తిగా భారత్‌లోనే నిర్వహించనున్నారు. ఇక ఆ మ్యాచ్‌లో లీగ్ దశ ఇప్పుడు జరిగినట్లుగానే రౌండ్ రాబిన్ పద్ధతిలో ఉంటుంది. ఆ తరువాత సెమీఫైనల్స్, ఫైనల్ ఉంటాయి.

2023 ఫిబ్రవరి 9 నుంచి మార్చి 26వ తేదీ వరకు వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్‌ను ఇప్పటికే ఫిక్స్ చేశారు. కాగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-8 లో ఉండే జట్లు ఆటోమేటిగ్గా వరల్డ్‌కప్ ఆడుతాయి. ఇక మిగిలిన 2 స్థానాల కోసం 5 జట్లు 2022లో నిర్వహించనున్న క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫైర్ మ్యాచ్‌లు ఆడుతాయి. ఈ క్రమంలో 2023 వరల్డ్ కప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి.

About The Author