స్వామివారు.. 40 ఏళ్లకు ఒకసారి దర్శనమిస్తారు..
కాంచీపురం దేవాలయాలకు నిలయం.
వందల ఆలయాలు కలిగి ఉన్న ఈ నగరం
శివకేశవ ఆలయాలకు కేంద్రంగా భాసిల్లుతోంది. జగన్మాత కామాక్షిమాతగా దర్శనమిస్తోంది. వైకుంఠనాధుడైన శ్రీమహావిష్ణువు చిద్విలాసమూర్తిగా వరదహస్తంతో వరాలనొసిగే వరదరాజ పెరుమాళ్ ఆలయం మరోసారి అరుదైన ప్రదర్శనకు వేదికయింది. 40 సంవత్సరాలకు 48 రోజులు మాత్రమే దర్శనమిచ్చే అనంత శయనమూర్తి దివ్యమంగళ విగ్రహం అత్తి వరదర్ స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు.
* ఆగస్టు 17 వరకు..
ఈ నెల 2న స్వామి వారి విగ్రహాన్ని పుష్కరిణి నుంచి బయటకు తీసి పవళింపు సేవతో ఉత్సవాలను ప్రారంభించారు.ఆగస్టు 17 వరకు స్వామివారిని దర్శించుకోవచ్చు. స్వామిని వీక్షించేందుకు దేశ దేశాల నుంచి వస్తున్న లక్షలాది భక్తులతో కాంచీ భక్తజనక్షేత్రంగా మారింది. వందల ఆలయాలతో నిత్యం దైవస్మరణలో ఉండే ఈ మహాక్షేత్రంలో అనంతపద్మనాభుని దర్శనం ఎంతో పుణ్యం.