నయీమ్ మరణించినా కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి…


గ్యాంగ్‌స్టర్ నయీమ్.. ఒకప్పుడు మారుమ్రోగిపోయిన పేరు ఇది.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో దందాలు.. మరెన్నో అరాచకాలు..! 2016లో నయీమ్ షాద్‌నగర్ పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతి చెందాడు.
ఆ తర్వాత అతడు ఎవరెవరిని బెదిరించి లాక్కున్నాడో అందరూ పోలీసుల ముందు చెప్పుకొచ్చారు. వందల కోట్లకు పైగా పడగలెత్తిన నయీమ్ ఆస్తులను చూసి అందరూ విస్తుపోయారు.
ఇప్పుడు నయీమ్ తల్లి తాహెరాబేగంను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు కేసుల్లో నిందితురాలిగా ఉన్నందున అమెను అరెస్ట్ చేసినట్లు భువనగిరి పోలీసులు తెలిపారు. ఈమె కూడా భూకబ్జాలు, బెదిరింపులు, కిడ్నాప్‌లు, మోసాలతో పాటు పలు నేరాలకు పాల్పడిందట.
తాహెరాబేగంపై 12 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూరులో ఉన్న ఆమెను అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
నయీమ్ మరణించినా నయీమ్ ముఠా కార్యకలాపాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. నాలుగు నెలల క్రితం నయీమ్ బినామీ ఆస్తులను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన అనుచరులను, నయీమ్ భార్యను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే..!

About The Author