వాడి వేడిగా సాగుతున్న రైతు ఆత్మహత్యలపై చర్చ…

ఏపీలో రైతు ఆత్మహత్యలపై శాసనమండలిలో వాడివేడి చర్చ జరిగింది. 2014 -2019 మధ్య కాలంలో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పారు. 1360 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అందులో 420 మందికి పరిహారం ఇచ్చినట్లు మంత్రి బొత్స వెల్లడించారు. మిగతా వారికి తమ ప్రభుత్వం తరుపున ఏడు లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు.

ఆ సమయంలో తెదేపా ఎమ్మెల్సీ వైవీబి రాజేంద్ర ప్రసాద్ లేచి.. వైఎస్ హయాంలో ఆత్మహత్య చేసుకున్న వారికి పరిహారం ఇస్తారా అని ప్రశ్నించారు. దీనిపై మంత్రి వెల్లంపల్లి అభ్యంతరం వ్యక్తం చేశారు. 30 పార్టీలు మారిన వెల్లంపల్లి జోక్యం ఎందుకని వైవీబి రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించటంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. అయితే రైతులందరికీ న్యాయం చేస్తామని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ఆత్మహత్యలు లేకుండా రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు

About The Author