రూపాయికే ఇంటి రిజిస్ట్రేషన్‌: కేసీఆర్‌


తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా తెలంగాణ పురపాలక చట్టం-2019పై చర్చ జరుగుతోంది.ఈ చట్టం ఆవశ్యకత, ముఖ్యాంశాలు, లక్ష్యాలు, ఆలోచనలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అవినీతి రహిత పాలన కోసం నూతన పురపాలక చట్టం తెస్తున్నామని చెప్పారు.తెలంగాణ పురపాలక చట్టం-2019 ద్వారా పారదర్శకత వస్తుందన్నారు. అవినీతి రహిత మున్సిపల్‌ వ్యవస్థ నిర్మాణమవుతుందని చెప్పారు.పేదల కోసం పౌరసదుపాయాలు కల్పించామన్నారు. ఈ చట్టాన్ని అనుసరించి 75 గజాల లోపు ఇంటి నిర్మాణానికి రిజిస్ట్రేషన్‌ ఫీజు కేవలం రూపాయి మాత్రమే ఉంటుందని, జీ ప్లస్‌ 1 వరకు రూపాయితో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని తెలిపారు.

About The Author