అసెంబ్లీ సీట్ల పెంపు దిశగా ఏపీ ప్రభుత్వం…

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పునర్విభజనకు కేంద్రం అడుగులు వేగవంతం చేసిందా? ఇప్పటికే దానికి సంబంధించిన కేబినెట్‌ నోట్‌ను ఈసీకి పంపిందా? అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. ఏపీ, తెలంగాణ సహా రెండు రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ఇప్పటికే చేపట్టినట్టు తెలుస్తోంది.

పునర్విభజనకు సంబంధించి ఒక కమిషన్‌ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై నిర్ణయం చెప్పాలంటూ ఒక కేబినెట్ నోట్‌ను ఇప్పటికే ఈసీకి పంపినట్లు సమాచారం. సమాచార హాక్కు చట్టం కింద ఓ వ్యక్తి వివరణ కోరగా ఈసీ ఈ వివరాలను వెల్లడించింది. జమ్మూకాశ్మీర్, సిక్కింతో పాటు ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపునకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.సీట్ల పెంపుపై ఇప్పటికే కేంద్ర న్యాయ శాఖ, హోంశాఖలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.

ఏపీలో 225 సీట్లు, తెలంగాణలో 151 సీట్లకు పెరగనున్నాయి. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని కీలకమైన సవరణలు చేయాల్సిన నేపథ్యంలోనే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే ఆ సవరణలతో బిల్లును గట్టేక్కించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం

About The Author