ఆస్తుల కేసులో సీఎం జగన్ కు ఊరట: ఆస్తులు తిరిగి ఇచ్చేయాలని ఈడీకి ట్రిబ్యునల్ ఆదేశం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి తీపికబురు అందింది అప్పిలేట్ ట్రిబ్యునల్. వాన్ పిక్ కేసులో ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను తిరిగి ఇచ్చేయాలని అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అంతేకాదు జగన్ ఆస్తులను అటాచ్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది.
అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశాలతో సీఎం వైయస్ జగన్ తోపాటు వాన్ పిక్ కేసు ఎదుర్కొంటున్న ప్రముఖ వ్యాపార వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ లకు చెందిన ఆస్తులు విడుదల కానున్నాయి.
ఆస్తుల కేసులో ఈడీ జగన్ కు చెందిన రూ.746 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ఇడుపుపాయలోని 42 ఎకరాలభూమి, పులివెందులలో 16 ఎరాలు, బంజారాహిల్స్ లో సాగర్ సొసైటీలో ప్లాట్లు, ఓ కమర్షియల్ స్థలం, షేర్లు, ఓ టీవీ ఛానెల్ కు సంబంధించిన యంత్రాలను జప్తు చేసింది.
మరోవైపు వాన్ పిక్ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ కు సైతం ఊరట లభించింది. నిమ్మగడ్డ ప్రసాద్ కు సంబంధించిన రూ.324 కోట్లను ఈడీ గతంలో అటాచ్ చేసింది. ఆ ఆస్తులను కూడా విడుదల చేయాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే నిమ్మగడ్డ ప్రసాద్ ను రూ.274 కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీని చూపించాలని ఆదేశించింది.