అసోంలో రైతు పంట బంగారమే!
* కేజీ టీ = రూ. 50,000
* బహిరంగ వేలంలో రికార్డు స్థాయి ధర
పేరుకు తగ్గట్లుగానే ఆ టీ ‘బంగారం’లా అమ్ముడు పోయింది. కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా కేజీ రూ. 50,000 పలికింది. అసోంకు చెందిన ‘మనోహరి గోల్డ్ టీ’ ఈమేరకు సరికొత్త రికార్డు సృష్టించింది.
గువాహటి టీ వేలం కేంద్రం (జీటీఏసీ) మంగళవారం నిర్వహించిన బహిరంగ వేలంలో నగరానికి చెందిన
ఓ వర్తక సంస్థ ఈ ధరకు 2 కేజీల టీ కొనుగోలు చేసింది.
దిబ్రూగఢ్‌కు చెందిన మనోహరి టీ ఎస్టేట్ ఉత్పత్తి చేసిన ఈ సంప్రదాయ టీ రకానికి (పీ-126)మార్కెట్లో గొప్ప గిరాకీ ఉంది. దీంతో ఇంతవరకు ‘డోనీ పోలో’ పేరిట ఉన్న కేజీ రూ. 40,000 రికార్డు తుడిచి పెట్టుకుపోయింది. టీ ధరల్లో ఇది ప్రపంచ రికార్డుగా కూడా గువాహటి వేలం కొనుగోలుదారుల సంఘం భావిస్తోంది. దేశవ్యాప్తంగా టీ ఉత్పత్తిదారులు తాము సాగుచేసే మేలురకపు నాణ్యమైన టీని విక్రయించుకునేందుకు, వాటికి డిమాండ్‌ను పెంచేందుకు జీటీఏసీ ఓ చక్కని వేదిక. కాగా ఈ విజయానికి తామెంతో కృషి చేసినట్లు ‘మనోహరి’ యజమాని రాజన్ లోహియా తెలిపారు. ఈ టీ చిక్కనైన బంగారం రంగులో ఉంటుందని చెప్పారు. తాము నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టి, వివిధ ప్రత్యేక టీ రకాలను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ ఎస్టేట్‌లో ఎక్కువ మంది వాడే సంప్రదాయ
‘సిటీ-సిటీ’ రకాన్ని.. అలగే గ్రీన్, అలోంగ్, యెల్లో,
వైట్, సిల్వర్ నిడెల్ వంటి రకాల టీలను ఉత్పత్తి చేస్తున్నారు.