జురాలలో క్రిష్ణమ్మ పరవళ్ళు…


పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. మధ్యహ్నం 1 గంట సమయంలో జూరాల ప్రాజెక్టు పూర్తిగా నిండగా ఎగువ నుంచి వస్తున్న లక్ష క్యూసెక్కుల నీటిని శ్రీశైలం రిజర్వాయర్ కు విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం ఆల్మట్టికి లక్షా30 వేల క్యూసెలక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. పైనుంచి వరద ప్రవాహం పెరగొచ్చని సమాచారం ఉండటంతో లక్షా 89 వేల క్యూసెక్కుల నీటిని నారాయణపుర జలాశయానికి విడుదల చేస్తున్నారు. నారాయణపురకు లక్షా60 వేల క్యూసెక్కులు చేరుతుండగా జూరాలకు లక్షా85 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
ఆల్మట్టికి రేపు ఉదయానికి లక్షా76 వేల నుంచి 2 లక్షల క్కూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ బులెటిన్ పేర్కొంది. దానితో ఆల్మట్టి, నారాయణపురాల్లో కనీసం 5 టిఎంసీల ఖాళీ(బఫర్) ఉంచి వస్తున్న నీటిని దిగువకు పంపిస్తున్నారు.
ఈ సాయంత్రానికి శ్రీశైలం జలాశయం ఇన్ ఫ్లో లక్ష క్యూసెక్కులకు రేపు ఉదయానికి లక్షా 70 వేలకు చేరొచ్చు. శ్రీశైలం నిండాలంటే 180 టిఎంసీల నీరు అవసరం. రోజుకు లక్షా ఎనబై వేల క్యూసెక్కుల చొప్పున 12 రోజులు నిరంతరాయంగా వచ్చి చేరితే శ్రీశైలం నిండు తుంది. (ఫోటో: జూరాల ప్రియదర్శిన ప్రాజెక్టు)

About The Author