ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా స్టీఫెన్ రవీంద్ర నియామకం

ఏపీ ఇంటలిజెన్స్ ఛీఫ్ గా స్టీఫెన్ రవీంద్ర నియామకానికి లైన్ క్లీయర్ అయ్యింది. ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్‌కు కేంద్ర హోంశాఖ అనుమతించింది. దీంతో రెండు మూడు రోజుల్లో స్టీఫెన్ రవీంద్ర ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్ లెటర్‌ను తెలంగాణా ప్రభుత్వానికి కేంద్రం పంపనుంది. ఆ తర్వాత స్టీఫెన్ ను ఆంధ్రప్రదేశ్ కు డిప్యుటేషన్ కింద తెలంగాణ ప్రభుత్వం పంపనుంది.

ప్రస్తుతం స్టీఫెన్ రవీంద్ర రెండు నెలలుగా లీవ్‌లో ఉన్నారు.గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఛీప్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా స్టీఫెన్ రవీంద్ర పనిచేశారు. రాయలసీమలో కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. 1990 బ్యాచ్‌కు చెందిన రవీంద్ర.. సర్దార్ వల్లభాయ్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు.

ఇటీవల తెలంగాణలో చోటు చేసుకున్న ఐటీ గ్రిడ్ చోరీకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇంఛార్జ్‌కు కూడా స్టీఫెన్ రవీంద్ర వ్యవహరించారు. రెండు నెలల కిందటే ఆంధ్రప్రదేశ్‌ కొత్త ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా కుమార్‌ విశ్వజిత్‌ నియమితులయ్యారు. విశ్వజిత్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 1994 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన విశ్వజిత్‌ను నియమించారు.

About The Author