పక్కా ప్రణాళికతో రూ.కోట్లు కొల్లగొట్టారు…


చిట్టీలు, వడ్డీ వ్యాపారం ముసుగు

వరంగల్ : అధిక వడ్డీలను ఆశచూపి కోట్లు కొల్లగొట్టిన నాతీ మమత ఆచూకీ కోసం కోసం బాధితులు లబో దిబోమంటూ తిరుగుతున్నారు. హంటర్ రోడ్డు ధిన్ దయాల్ నగర్ నివాసం ఉంటున్న నాతీ మమత పక్కా ప్లాన్‌తో అందిన కాడికి అప్పులు చేసి, చిట్టీలు కట్టించుకుని కనిపించకుండా పోయారు. బాధితుల ఆవేదనను వివరిస్తూ మంగళవారం ‘సాక్షి’లో వచ్చిన వార్తతో మరింత మంది బాధితులు వెలుగులోకి వచ్చారు. నాతీ మమత నివాసం ఉంటున్న చుట్టూ తిరుగుతున్నారు.
పెద్ద సంఖ్యలో బాధితులు
బాధితుల్లో పెద కుటుంబాల వారే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. పెధా మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరు రూ.50 లక్షలు, రూ.30 లక్షలు చొప్పున అప్పులిచ్చినట్టు సమాచారం. అయితే వీరు కేసులు జోలికి వెళ్లకుండా పరిచయస్తుల ద్వారా ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. మరింత మంది బాధితులు వెలుగులోకి వచ్చారు. వార్తకు స్పందించిన టౌన్‌ ఎస్సై మహేందర్ కూడా మంగళవారం కాలనీ వద్దకు వెళ్లి కొందరితో మాట్లాడారు. ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేస్తామని నచ్చజెప్పారు. అయితే పోలీసులకు మాత్రం ఈ విషయంలో ఎలాంటి ఫిర్యాదు ఇప్పటివరకూ అందలేదు. మొత్తంగా ఈ ఘటన పట్టణంలో సంచలనం కలిగించింది.
ఈనేపథ్యంలో ఇంటి వద్ద చిట్టీలు కట్టించుకోవడం ప్రారంభించారు. అలాగే తాము రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నామని చెబుతూ అధిక వడ్డీలకు అప్పులు చేసేవారు. అప్పులు ఇచ్చిన వారికి కొంతకాలం నూటికి రూ.5, రూ.10 చొప్పున వడ్డీ సొమ్ములు ముట్టజెప్పారు. ఇది బాగా ప్రచారం కావడంతో చాలామంది వీరికి అప్పులు ఇచ్చారు. వీధుల్లో తిరుగుతూ, పాలు పోసేవారు కూడా వీరి వద్ద చిట్టీలు కట్టారు. చివరకు అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌ను కూడా ఈ జంట. పాట పాడుకున్న తరువాత వారికి డబ్బులు ఇవ్వకుండా, అధిక వడ్డీలు ఇస్తామని సొమ్ములు వసూలు చేస్తున్నారు . ఇలా సేకరించిన మొత్తం సొమ్ములతో వీరు ఉడాయించారు.
సమాచారం అందించిన వారికి తగిన బహుమతి

About The Author