రాష్ట్రంలో కుండపోతగా వర్షాలు.. రంగంలోకి దిగిన మంత్రులు…


రాష్ట్రంలో గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి కురుస్తున్న వర్షాలకు తోడు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి వరద ఉధృతమైంది. గోదావరికి వరద వచ్చినప్పుడు లంక గ్రామాల్లో పరిస్థితులు దారుణంగా ఉంటాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోతుంటాయి.ఏపీలో ఉధృతం దాల్చిన గోదావరి పరిస్థితిపై సహాయ చర్యలను ముమ్మరం చేసేందుకు వైసీపీ మంత్రులు రంగంలోకి దిగారు.

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వరద పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి తానేటి వనిత జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పోలవరం వరద ప్రవాహం క్రమేపి తగ్గుతోందని శుక్రవారానికి వరద పూర్తి స్థాయిలో తగ్గుముఖం పడుతుందని పశ్చిమగోదావరి జిల్లా ఇంచార్జి మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు. ఆయన కూడా సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

About The Author