చంద్రబాబు అవినీతిపై సమీక్షలకు ఉలుక్కిపడుతున్న టీడీపీ


గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని బయటపెడుతుంటే టిడిపి తప్పుడు ప్రచారం చేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు టెండర్లను నామినేషన్ ప్రాతిపదికన ఇచ్చేసి… ఇప్పుడు వాటిని సమీక్ష చేస్తుంటే టిడిపి ఉలిక్కి పడుతోందని ఆయన అన్నారు.

గోదావరిలో ప్రస్తుతం నీటిమట్టం ఎక్కువగా ఉన్నందున నవంబర్ 1 నుంచి పనులు మొదలు పెడతామన్నారు. గత తెదేపా ప్రభుత్వం పునరావాసంపై కూడా దృష్టి పెట్టలేదని, కేవలం రూ.800 కోట్లు ఇచ్చి మమ అనిపించేశారని మండిపడ్డారు. కానీ, ప్రకటనల కోసం మాత్రం రూ.200 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఇంకా రూ.37 వేల కోట్లు అవసరమవుతుందని పేర్కొన్నారు.

పోలవరం పునరావాస ఏర్పా్ట్లను పర్యవేక్షించేదుకు ఓ ఐఏఎస్ అధికారిని నియమిస్తామని వివరించారు. రివర్స్ టెండర్ కారణంగా 5 నుంచి 10 శాతం ప్రాజెక్టు వ్యయం తగ్గుతుందన్నారు. వరద కారణంగా స్పిల్ వే, కాఫర్ డ్యామ్‌పై సిల్ట్‌ పేరుకుపోయిందని, దానిని తొలగించి పనులు మొదలు పెడతామని మంత్రి వివరించారు. 2021 జూన్‌కు గేట్లతో సహా డ్యామ్ నిర్మాణం పూర్తవుతుందని మంత్రి వెల్లడించారు.

About The Author