సుష్మా స్వరాజ్ ఇకలేరు…గుండెపోటుతో ఢిల్లీ ఎయిమ్స్ లో కన్నుమూత..


కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్య శాలలో కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో కన్నుమూసిన సుష్మ స్వరాజ్ వయస్సు 67 సంవత్సరాలు. అయితే హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సుష్మాకు గుండెపోటురావడంతో ఆమెను అత్యవసరంగా ఎయిమ్ష్ తరలించారు. అయితే చికిత్స అందిస్తుండగానే మధ్యలోనే సుష్మా కన్నుమూశారు. దీంతో సర్వత్రా విషాదం అలుముకుంది.

కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్య శాలలో కన్నుమూశారు. గత కొంత కాలంగా హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సుష్మాస్వరాజ్‌కు ఆకస్మికంగా గుండెపోటు రావడంతో ఆమెను అత్యవసరంగా ఎయిమ్స్ తరలించారు. అయితే చికిత్స అందిస్తుండగానే మధ్యలోనే సుష్మా కన్నుమూశారు. దీంతో సర్వత్రా విషాదం అలుముకుంది. తీవ్ర అస్వస్థతతో కన్నుమూసిన సుష్మ స్వరాజ్ వయస్సు 67 సంవత్సరాలు. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి బిల్లు తొలగింపు సందర్భంగా ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాలకు అభినందనలు తెలుపుతూ చివరి ట్వీట్ చేశారు. సుష్మా స్వరాజ్ హఠాన్మరణంతో బీజేపీ శ్రేణులన్నీ విషాదంలో మునిగిపోయాయి. బీజేపీ తొలితరం నేతల్లో ఒకరైన సుష్మా స్వరాజ్ 1953 ఫిబ్రవరి 13న హర్యానాలోని అంబాలాలో జన్మించారు. కేంద్రంలో వివిధ హోదాల్లో పనిచేసిన సుష్మా స్వరాజ్ గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. గతంలో ఆమె కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయడంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

About The Author