మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారత రత్న…


మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ అవార్డు ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మోదీ, ఎల్ కే అద్వానీ, కేంద్రమంత్రులు తదితరులు హాజరయ్యారు. ప్రణబ్ ముఖర్జీతో పాటు సామాజిక కార్యకర్త నానాజీ దేశ్‌ముఖ్, ప్రముఖ అస్సామీ గాయకుడు భూపేన్ హజారికాలకు కూడా వారి మరణానంతరం భారత రత్న పురస్కారాన్ని ప్రకటించారు. అయితే ఈ కార్యక్రమంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ పాల్గొనలేదు అని సమాచారం..

ప్రణబ్‌ ముఖర్జీ రాజకీయ రంగంలో అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతి స్థాయికి చేరుకున్నారు. రాష్ట్రపతిగా ఆయన ఎన్నో విశిష్ట సేవలు అందించారు. అంతకు ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వాలలో కొనసాగిన ఆయన కేంద్రంలో రక్షణ శాఖ, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రణబ్ ముఖర్జీ కలకత్తా విశ్వవిద్యాలయం, సూరి విద్యాసాగర్ కళాశాలలో చదివారు. చరిత్ర, రాజనీతి శాస్త్రం, న్యాయ శాస్త్రంలో డిగ్రీలు పొందారు. 1935 డిసెంబరు 11న జన్మించిన ప్రణబ్ ముఖర్జీ ఐదు దశాబ్దాలపాటు రాజకీయ రంగంలో ఉంటూ దేశానికి సేవలందించారు. 2012 నుంచి 2017 వరకు రాష్ట్రపతిగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కీలక మంత్రి పదవులు నిర్వహించారు. 1973లో తొలిసారి ఇందిరా గాంధీ మంత్రివర్గంలో మంత్రి పదవిని చేపట్టారు. పీ వీ నరసింహా రావు ప్రభుత్వంలో 1991లో ప్రణబ్ ముఖర్జీని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారు.

About The Author