సెలవు రోజు కూలీగా మారిన సబ్ రిజిస్ట్రార్ తస్లిమా…

 


రామచంద్రపురం గ్రామానికి చెందిన తస్లీమా ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి జిల్లా సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తుంది. ఒక వైపు సామజిక సేవా కార్యమాలు మరో వైపు ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తు నేడు సెలవు దినం కావడంతో తన స్వగ్రామం ములుగు మండలం రామచంద్రపురం గ్రామంలో గ్రామానికి చెందిన కౌలు రైతు రాఘవరెడ్డి నీలమ్మ దంపతుల వ్యవసాయ భూమి లో గత ఐదు సంవత్సరాలుగా ఎప్పటిలాగే ఈసారి కూడా దినసరి కూలీగా మహిళలతో కలిసి పొలం పనులు చేస్తూ వరి నాట్లు వేసి మధ్యాహ్నం వారితో కలసి పొలం వద్ద భోజనం చేసారు. ఈ సందర్బంగా భూ యజమాని రాఘవరెడ్డి తస్లిమా గారికి రోజు వారి కూలి 250 రూపాయలు అందజేశారు. అనంతరం గ్రామంలో వృద్ధాప్యంలో కూడా కుటుంబాన్ని పోషిస్తున్న చాకలి సారమ్మ కి అండగా వచ్చిన కూలిని మరియు మరి కొంత డబ్బు ని కలిపి ఆ వృద్ధురాలికి ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ సందర్బంగా తస్లిమా గారు మాట్లాడు తాను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టి పెరిగాను అని గుర్తు చేసుకున్నారు. ప్రపంచంలో రైతు జీవితమే అత్యున్నతమైన జీవితమని వారు లేకుంటే నేడు ఈ దేశానికె అన్నం లేదన్నారు అలాంటి రైతును ప్రతి ఒక్కరు గౌరవించి సమాజంలో సముచిత స్థానం కల్పించాలన్నారు ఈ సందర్బంగా పలువురు మహిళలు తస్లిమా గారిని అభినందించారు….

About The Author