ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలో క్రీడా పోటీలు…


13 జిల్లాలలో క్రీడా పోటీలు జరగాలని సీఎం జగన్ గారు చెప్పారని శ్రీకాకుళం ఇంచార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో సీఎం కప్ వాలీబాల్ టోర్నమెంట్ ను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ముందుగా శ్రీకాకుళం జిల్లాలో ఈ పోటీలు నిర్వహిచడం సంతోషంగా ఉందని మంత్రి వెల్లంపల్లి అన్నారు. క్రీడకారులుగా గుర్తింపు పొందిన ధర్మాన సోదరులు అందరికీ ఆదర్శమని మంత్రి వెల్లంపల్లి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో క్రీడా పోటీలు హైదరాబాద్ లో జరుగేవని ఆయన చెప్పారు. ఇపుడు అన్ని జిల్లాలో క్రీడా పోటీలు జరగాలని, అన్ని జిల్లాలను అభివృద్ధి చేయాలని సీఎం జగన్ చెప్పారని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. అన్ని జిల్లాల అభివృద్ధి కోసం ఆలోచిస్తున్న సీఎం జగన్ సారథ్యంలో పనిచేయడం గర్వంగా ఉందని శ్రీకాకుళం జిల్లా ఇంచార్జి మంత్రి వెల్లంపల్లి. శ్రీనివాస్ అన్నారు. క్రీడాకారులకు ప్రతీ చోటా గుర్తింపు ఉంటుందని, క్రీడల్లో బాగా రాణించి క్రీడాకారులు ఉన్నత స్థితిలో ఉండాలని కోరుతున్నానని మంత్రి కృష్ణ దాస్ చెప్పారు. మూడురోజుల పాటు దిగ్విజయంగా సీఎం కప్ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామని మంత్రి ధర్మాన.క్తిష్ణదాస్ చెప్పారు. ఈ పోటీలలో పాల్గొంటున్న13 జిల్లాలకు చెందిన జిల్లాల నుండి 26 జట్లు లోని సభ్యులు క్రీడా స్ఫూర్తి తో ఆడాలని కోరారు. సీఎం కప్ పోటీలు ప్రారంభించిన అనంతరం మంత్రులు శ్రీనివాస్, కృష్ణదాస్, ఎమ్మెల్యేలు అప్పలరాజు, జోగులు సరదాగా వాలీబాల్ ఆడారు. అనంతరం శాంతి నగర్ కాలనీ లో 2 కోట్ల తో నిర్మించిన బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం ను మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, జోగులు, కిరణ్, అప్పలరాజు, కలెక్టర్ నివాస్ పలువురు అధికారులు పాల్గొన్నారు.

About The Author