యాదాద్రికి హరిత సొబగులు -కనువిందు చేస్తున్న పచ్చదనం…


యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి నడయాడిన నేల హరితవనంతో పులకరిస్తున్నది. పచ్చదనంతో పరవశిస్తున్నది. 250 ఎకరాల్లో రూ.200 కోట్లతో చేపట్టిన టెంపుల్ సిటీలోని ప్రతి అంగుళం పచ్చదనంతో నిండిపోగా, రూ.20 కోట్ల అంచనాలతో చేపట్టిన కొండ చుట్ట్టూ సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి. టెంపుల్ సిటీ యాదాద్రిని చూసిన భక్తు లు, పర్యాటకులు ముచ్చటపడుతున్నారు. ల్యాండ్‌స్కేపింగ్ పనులు యా దాద్రికి కొత్త అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. యాదాద్రికొండ చుట్టూ చక్కటి ల్యాండ్ స్కేపింగ్‌కు తోడుమూడంచెల్లో కొండను అం దంగా తీర్చిదిద్దే పనులు జరుగుతున్న తీరుతో కొండంతా శోభాయమానంగా మారుతున్న ది. యాదాద్రి కొండపైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం అధికారులు ఘాట్‌రోడ్లపై పచ్చని పచ్చిగబయళ్లతోపాటు వివిధ రకాల మొక్కలను నాటడంతో దారిపొడవునా పచ్చనితోరణాలే దర్శనిమిస్తున్నాయి.

యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని గ్రీన్‌సిటీగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో వైటీడీఏ అధికారులు ఆ దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఏటా తెలంగాణకు హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతున్నారు. నాలుగువిడుతల్లో నాటిన మొక్కలు సైతం ఇప్పుడు పచ్చగా దర్శనమిస్తున్నాయి. రూ.110 కోట్లతో చేపట్టిన రాయిగిరి-యాదాద్రి నాలుగు వరుసల రోడ్లకు ఇరువైపులా ఏర్పాటుచేసిన పచ్చదనం.. పచ్చకబయళ్లు కనువిందుచేస్తున్నా యి. భక్తులు, పర్యాటకులు, ఇతర ప్రయాణికులు ఇక్కడ ఆగి సేదతీరుతున్నారు.

ప్రభుత్వశాఖలు సైతం హరితహారంలో…
యాదగిరిగుట్టలో ప్రభుత్వశాఖల సహకారంతో గ్రీన్‌సిటీగా యాదాద్రి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పెద్దఎత్తున మొక్కలు నాటారు. కలెక్టర్ ప్రత్యేకంగా ప్రణాళికలను రూపొందించి యాదాద్రిని హరితవనంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేస్తున్నారు. పాఠశాలలు, హాస్టళ్లు, వైద్య, ఇతర సంస్థల ఆధ్వర్యంలో హరితహారం నిర్వహిస్తున్నారు. అటవీశాఖ యాదాద్రిలో ఏర్పాటుచేసిన నర్సరీల ద్వారా మొక్కలు పంపిణీ చేస్తున్నారు.పండ్ల మొక్కలు పంపిణీ చేపడుతున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో గతేడాది యాదాద్రిలో కిలోమీటర్‌కుపైగా మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టడంతో పచ్చగా మారాయి

About The Author