గుడ్డు కోడి బలమెంతో చెబుతుందా…?


సాధారణంగా కోడిగుడ్డులో ఉన్న పచ్చసొన ఉండే తీరును బట్టి ఆ గుడ్డు పెట్టిన కోడి ఆరోగ్యవంతమైనదా, లేదా అనేది తేల్చవచ్చునన్నది ఎప్పటినుంచో ఉన్న మాట. దీని ప్రకారం గుడ్డులోని పచ్చసొన ముదురురంగులో ఉండి, గుండ్రని ఆకారంలో ఉంటే ఆ కోడి ఆరోగ్యకరమైన ఆహారం తింటుదని, స్వేచ్ఛగా విహరించి ఉంటుందని భావించేవారు. అలాగే పచ్చసొన లేతరంగులో ఉంటే ఆ కోడి బలహీనంగా ఉండిఉంటుదని నమ్మేవారు. అయితే అదంతా వట్టిదే అంటున్నారు పరిశోధకులు. గుడ్డులో ఉండే పచ్చసొనను బట్టి ఆ గుడ్డు పెట్టిన కోడి ఆరోగ్యపరిస్థితులు నిర్ధారించలేమని తేల్చిచెప్పారు. గుడ్డుపెట్టే ముందు కోడి గోధుమ పట్టును ఎక్కవగా తినడం వల్ల ఆ పచ్చసొన లేత పసుపు రంగులోకి మారుతుందన్నారు. అలాగే ఒక కోడి ఆహారం తీసుకునే విషయంలో సమతుల్యత లేకుండా ఎక్కువగా మొక్కజొన్న సంబంధ పదార్థాలను తిన్నట్లయితే పచ్చసొన ముదురురంగులో ఉంటుందని వెల్లడించారు.
తేడా ఏమి ఉండదు..

పౌష్ఠికాహార పదార్థాల జాబితాలో ముందుండే కోడిగుడ్డులో విటమిన్‌ ఏ,డీ,ఈ,కే లు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుడ్డులో ఉన్న పచ్చసొన రంగును బట్టి దాని రుచిలో ఏమాత్రం తేడా ఉండదు. అలాగే పౌల్ట్రీ ఫాంలలో పెంచే కోళ్ల నుంచి లభించే గుడ్డు కాకుండా, నాటుకోళ్ల నుంచి లభ్యమయ్యే గుడ్లను తింటేనే ఆరోగ్యకరమన్నది కూడా అవాస్తవమని పరిశోధకుల అంటున్నారు. రెండింటిలోనూ సమానమైన పోషకవిలువలు ఉంటాయన్నారు.

About The Author