తిరుపతి లో ఈ చార్జింగ్ పాయింట్ ని ప్రారంభించిన కరుణాకర్ రెడ్డి…


ఈరోజు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద ఉన్న శ్రీ నివాస సముదాయాలు ఎదురుగా ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద నగర పాలక సంస్థ కాళీ ప్రదేశంలో తిరుపతి ఎమ్మెల్యే శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు చేతుల మీదగా ఈ వాహనాలు ఈ చార్జింగ్ పాయింట్ ని బ్యాటరీ తో నడిచే చార్జింగ్ పాయింట్ ప్రారంభించారు.
ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ స్మార్ట్ సిటీ లో భాగంగా ఎలక్ట్రిక్ ఆటో హబ్ పై అమర్ రాజా తిరుపతి నగర పాలక సంస్థ సహకారంతో ఈ ఆటోల సముదాయంతో పాటు రెండుEV బ్యాటరీ చార్జింగ్ స్టేషన్ అమర్చడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో ముందుగా తిరుపతి నుంచి బ్యాటరీతో నడిచే వాహనాలు తీసుకురావడం చాలా సంతోషం అని భవిష్యత్తులో విద్యుత్తు వాహనాలే ఎక్కువ రాబోతున్నాయని ముందుగా మన నగరం నుంచే శ్రీకారం చుట్టడం జరిగింది నగరంలోని 10 ప్రదేశాల్లో చార్జింగ్ పాయింట్లు (చార్జింగ్ స్టేషన్లు) పెట్టడం జరుగుతుందని మరియు ప్రభుత్వ స్థలాలు పరిశీలించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా పాయింట్ స్టేషన్ లో పెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గారు తెలియజేశారు.
కమిషనర్ వారు మాట్లాడుతూ ఈరోజు నుంచి బ్యాటరీతో నడిచే వాహనాలు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలియజేశారు ప్రభుత్వం వారితో మరియు కలెక్టర్ వారితో చర్చించి నగర ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రాయితీలు ఇచ్చే విధంగా బ్యాంకు మేనేజర్ లతో చర్చించి సబ్సిడీ ద్వారా కావాల్సిన వాళ్ళకి ఈ వాహనాలు అందుబాటులో తీసుకువస్తామని తెలియజేశారు మరియు తిరుపతి తిరుమల మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్దేశంతోనే కాలుష్యం లేకుండా నగరం పచ్చదనం గా ఉంటుందని అని బ్యాటరీ వాహనాలు తీసుకుంటే రోడ్ టాక్స్ గాని పన్నులు కట్టాల్సిన అవసరం లేదని దేశంలో ఎక్కడైనా తిరగ వచ్చు అని డబ్బు కూడా ఆదా అవుతుందని కమిషనర్ వారు తెలియజేశారు.
ఎమ్మెల్సీ శ్రీనివాసులు రెడ్డి గారు మాట్లాడుతూ మన తిరుపతి నుంచే శ్రీకారం చుట్టడం చాలా శుభప్రదమని తెలియజేశారు భవిష్యత్తులో కాలుష్య నివారణకు బ్యాటరీ వాహనాలు వాడడం చాలా మంచిదని కమిషనర్ వారు మంచి ఆలోచనతో శ్రీకారం చుట్టారు చాలా సంతోషమని తెలియజేశారు.
అమర్ రాజా గ్రూప్ చైర్మన్ డాక్టర్ రామచంద్ర గల్లా గారు మాట్లాడుతూ స్మార్ట్ సిటీ చొరవతో నగర పాలక సంస్థ కమిషనర్ మంచి ఉద్దేశంతో చేస్తున్న మంచి పని కోసం అమర రాజా ద్వారా నగర పాలక సంస్థ వారితో కలిసి పని చేయడానికి అమరరాజా గ్రూప్ ద్వారా అవకాశం ఇచ్చినందుకు కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేశారు.
రాస్ సంస్థ చైర్మన్ మునిరత్నం నాయుడు గారు పాల్గొని మహిళలకి బ్యాటరీ వాహనాలు ఇవ్వడం జరిగింది అని కమిషనర్ వారు మహిళా డ్రైవర్లు ఏర్పాటు చేయడంలో మహిళలకి మంచి చేయాలనే ఉద్దేశంతో ఆటో స్టాండ్ లో కూడా ఏర్పాటు చేయడంలో కమిషనర్ వారు చలవే అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ వారితో పాటు తిరుపతి ఎమ్మెల్యే శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారు, అమరరాజా గ్రూప్ చైర్మన్ డాక్టర్ రామచంద్ర గల్లా గారు, రాస్ మునిరత్నం గారు, తిరుపతి నగరపాలక సంస్థ ఉప కమిషనర్ చంద్రమౌలేశ్వర రెడ్డి గారు, మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్ గారు, నగర పాలక సంస్థ అధికారులు ,మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దొడ్డ రెడ్డి శంకర్ రెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, దొడ్డ రెడ్డి మునిశేఖర్ గారు మరియు అమరరాజా గ్రూప్ ఉద్యోగస్తులు మొదలగు వారు పాల్గొన్నారు.
కే గిరిబాబు
ఏపీ ఆర్ ఓ
నగర పాలక సంస్థ తిరుపతి

About The Author