గన్నవరం విమానాశ్రయంలో బాంబ్ కలకలం…
అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ అధికారులు……
రంగంలోకి దిగిన పోలీస్, ఫైర్, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది……
అరైవల్ బ్లాక్ లో బాంబ్ ను గుర్తించిన స్క్వాడ్…….
చాకచక్యంగా బాంబ్ ను తొలగించిన స్క్వాడ్ సిబ్బంది……
ఊపిరిపీల్చుకున్న అధికారులు………
ఇదంతా నిజం అనుకుంటున్నారా అయితే పొరపాటే…….
కానీ ఎప్పుడు అయినా అలాంటి ప్రమాద హెచ్చరికలు వచ్చినప్పుడు సిబ్బంది ఎలా అప్రమత్తంగా ఉండాలి అనే దానిపై ఎయిర్ పోర్ట్ అధికారులు నిర్వహించిన మాక్ డ్రిల్ ని ఇప్పుడు చూద్దాం….
గన్నవరం,ఆగస్ట్23(జన హృదయం)
కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయంలో బాంబ్ కలకలం రేపింది. నిత్యం వీఐపీ లతో రద్దీగా ఉండే ఎయిర్ పోర్ట్ లో బాంబ్ పెట్టారనే సమాచారం రావడంతో అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేశారు. బాంబ్ వార్త విన్న ఇద్దరు ప్రయాణికులు భయాందోళనకు గురై స్పృహ కోల్పోయారు. వారిని ఫైర్ సిబ్బంది వెంటనే ప్రధమ చికిత్స నిర్వహించి అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు. ఇదంతా చూసిన తోటి ప్రయాణికులు ఏమిజరిగింది అనితెలుసుకునే లోపు ఎయిర్ పోర్ట్ సిబ్బంది అప్రమత్తంగా ఉండేందుకు అధికారులు నిర్వహించే మాక్ డ్రిల్ అని తెలియడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్ ఏసీపీ రత్నం మాట్లాడుతూ గన్నవరం విమానాశ్రయంలో గతంలో కంటే ఇప్పుడు ప్రయాణికులు, విఐపీలు రద్దీ పెరగడంతో ఎయిర్ పోర్ట్ లో కట్టుదిట్టమైన భద్రతతో పాటు, ఎయిర్ పోర్ట్ లో బాంబ్ ఉందనే సమాచారం వచ్చినప్పుడు అధికారులు, సిబ్బంది ఎలా అప్రమత్తంగా వ్యవహరించాలి అనే దానిపై ప్రతి 6 నెలలకు ఇలా మాక్ డ్రిల్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎయిర్ పోర్ట్ అధికారులు, పోలీస్, ఫైర్ సిబ్బందితో పాటు బాంబ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.