23 వేల ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త చిక్కులు…


తెలంగాణ విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్టు పద్ధతిలో పని చేసిన 23వేల మంది కార్మికులను ప్రభుత్వం కిందటేడాది క్రమబద్ధీకరించింది. ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తున్నవారికి ఐదేళ్లకోసారి పదోన్నతి కల్పించాలని నిర్ణయించింది. ఓ గ్రేడ్‌లో కనీసం ఐదేళ్ల సర్వీసు ఉంటే దానికి పైన ఉండే గ్రేడ్‌కు పదోన్నతి కల్పిస్తామని చెప్పింది. గ్రేడ్‌ 4 ఆర్టిజన్‌గా ఐదేళ్ల సర్వీసు ఉన్న వారికి గ్రేడ్‌ 3 ఆర్టిజన్లుగా పదోన్నతి కల్పించనున్నారు. అలాగే మిగిలిన గ్రేడ్ లలో పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతి ఇవ్వనున్నారు. గ్రేడ్‌ మారితే ఆర్టిజన్ల వేతనాలు సైతం పెరగనున్నాయి. ప్రస్తుతం ఆర్టిజన్లకు ఏక మొత్తం వేతనాన్ని మాత్రమే చెల్లిస్తుండగా, ఇకపై వారికి సైతం రెగ్యులర్‌ ఉద్యోగుల తరహాలో టీఏ, ఇంక్రిమెంట్లు, బోనస్, ఎక్స్‌గ్రేషియా, సెలవులు, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్, ఇతర ప్రయోజనాలు వర్తింపజేయాలని రెగ్యులరైజ్ చేసిన సమయంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు స్టాండింగ్ ఆర్డర్స్ ను వర్తింపు చేయాలని విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయి. ఆ నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో, టీఎస్‌ఎస్పీడీసీఎల

About The Author