రేషన్ సరుకులు ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం…
ఏపీలో ‘ఈ-కేవైసీ’ ఎప్పుడైనా చేయించుకోవచ్చు.. ప్రజలు టెన్షన్ పడొద్దు!: ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి*
రేషన్ సరుకులు ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం
మరిన్ని ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నాం
కడపలో మీడియాతో వైసీపీ నేత
ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రానిక్-నో యువర్ కస్టమర్(ఈ-కేవైసీ)పై చెలరేగుతున్న వదంతులకు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తెరదించారు. ఈ-కేవైసీ చేయించకపోతే రేషన్ కార్డులు రద్దుచేస్తారని వస్తున్న వార్తల్లో నిజం లేదని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ-కేవైసీ నమోదుచేయించుకోవడానికి గడువు లేదనీ, ఎప్పుడైనా చేయించుకోవచ్చని స్పష్టం చేశారు. కడప జిల్లాలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ-కేవైసీ సాకుతో రేషన్ డీలర్లు ప్రజల పేర్లను తొలగించినా, రేషన్ సరుకులు ఇవ్వకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ-కేవైసీ ప్రక్రియను సులభతరం చేసేందుకు మరిన్ని ఆధార్ నమోదు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ-కేవైసీ కోసం మహిళలు చంటి బిడ్డలతో గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోవాల్సిన అవసరం లేదని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.