రైతులకు అండగా ప్రభుత్వం…


టెక్కలి: రైతులకు అండగా వుండేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో వుందని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. కోటబొమ్మాలి మండలం లక్ష్మీనారాయణపురం వద్ద రూ.10.88 కోట్లతో ఏర్పాటుచేసిన సీడాం ఎత్తిపోతల పధకాన్ని మంత్రి ప్రారంభించారు. మంత్రి ప్రారంభించిన సీడాం ఎత్తిపోతల పధకం ద్వారా కోటబొమ్మాళి మండలంలోని సీడాం,దరివాడ,రేగులపాడు, విశ్వనాదపురం, ఆనందపురం, తలతరియు మొదలగు ఆరు గ్రామాలలో 1550 ఎకరాలకు ఆయకట్టు లభిస్తుందని, తద్వారా 1400 మంది రైతులు లబ్దిపొంతుతారని వివరించారు. ఈ సంధర్బంగా మంత్రివర్యులు మాట్లాడుతూ అన్నివర్గాల పట్ల నిష్పక్షపాతంగా ప్రవర్తిస్తామని, సమర్థవంతమైన పాలన అందిస్తామని, నవరత్నాల పధకాలను అర్హులందరికీ వర్తింపజేస్తామని స్పష్టం చేసారు. అదేవిధంగా ప్రజల్ని, ఉద్యోగులను స్వంత కుటుంబంలా చూసుకుంటామన్నారు. ఎత్తిపోతల పధకం ప్రారంభోత్సవంలో ఎం.పి. కె.రావ్మెూహననాయుడు, టెక్కలి శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ ఇ.ఇ. లక్ష్మీపతి, దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్, ధర్మాన కృష్ణచైతన్య, పలువురు మాజీ ఎం.పి.టి.సి.లు, జెడ్.పి.టి.సి.లు, సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు

About The Author