వృద్దురాలు రేణు మండల్

స్వార్థం రాజ్యమేలుతుంది.

బంధం, అనుబంధాల విలువ మంట గలిసింది.

అప్పుడు అసహ్యంగా ఉందని కన్నతల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన కూతురు.

ఇప్పుడు తాను భారతదేశం మొత్తం ప్రశంసించిన తర్వాత

ప్రేమగా చూసుకుంటానని  కూతురు ముందుకు రావడం ఆలోచించాల్సిన విషయం.

 

పైసామే_పరమాత్మ

మనిషులు ఎంత స్వార్థపరులయ్యారో చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ..

 

ఈ వృద్దురాలు రేణు మండల్ 

ఈమె కుమార్తె పెరిగి పెద్దదయిన తరువాత తల్లి వికారంగా ఉందని సిగ్గుపడి ఇంట్లో నుండి గెంటేసింది.

రేణు మండల్ 7 సంవత్సరాలు రైల్వే ప్లాట్‌ఫాంపై దేవుడిచ్చిన అద్బుతమైన గొంతుతో పాడుతూ బిక్షాటన చేస్తూ బ్రతికింది.

 

ఒక యువకుడు  ఆమె యొక్క పాట వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో ఉంచారు,సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..సోనీ ఛానెల్ నుండి పిలుపు రావడంతో రాత్రి రాత్రికి స్టార్ అయ్యింది.

 

ఏ కూతురైతే తల్లి ముసలిదైంది అని ఇంట్లో నుండి గెంటేసిందో ఆమే వచ్చి మొఖాన నవ్వు పులుముకోని తల్లిని హత్తుకుంది

 

 ఆధునిక యుగంలో పిల్లలకు తల్లిదండ్రులు బోధించాల్సిన విషయాలు ఏమిటంటే!

ఇతరుల పట్ల దయ,కరుణ, జాలి కలిగి ఉంటూ

అపాయ్యత అనురాగాలను పంచాలి.

ఆ క్షణంలో ఎదుటి వ్యక్తి యొక్క శరీర సౌందర్యం లేదా కుల మత ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదని.

About The Author