పత్తి మద్దతు ధరలో తేడా రావద్దు..మంత్రి నిరంజన్ రెడ్డి..


పత్తి మద్దతు ధరలో తేడా రావొద్దని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గారు తెలిపారు. నగదు చెల్లింపులు వెంటనే జరగాలి. పత్తి మొదటి రకం రూ.5,550, రెండో రకం రూ.5,255. గత ఏడాది 230 మిల్లులు గుర్తించగా, 37 మార్కెట్లలో కొనుగోళ్లు జరిగాయి. ఈ ఏడాది 302 మిల్లులు గుర్తించడం జరిగింది. వ్యాపారులు మిల్లుల వద్ద అన్ని సదుపాయాలు కల్పించాలి. తూకం విషయంలో ఎలాంటి తేడాలు రావొద్దు. వే బ్రిడ్జ్‌లు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. అనుమతిచ్చిన ఛార్జీలకు మించి రైతుల నుంచి ఒక్క పైసా ఎక్కువ వసూలు చేయొద్దు. గుర్తింపు లేని రైతులను గుర్తించి స్థానిక అధికారులు క్యూఆర్ కోడ్ ఇవ్వాలి. పత్తి కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో ఆన్‌లైన్‌లో డబ్బులు జమచేయాలి. డబ్బులు జమచేయడంలో జాప్యం చేయొద్దు. కొనుగోలుకు సంబంధించి రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో కమిటీలు చేసుకోవాలని సూచించారు.

About The Author