జియో రూ.10,900 కోట్లు, ఎయిర్‌టెల్ కంటే రూ.198 కోట్లు ఎక్కువ…


రూ.10,900 కోట్లు, ఎయిర్‌టెల్ కంటే రూ.198 కోట్లు ఎక్కువన్యూఢిల్లీ : ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఆదాయంలోనూ టాప్ కంపెనీగా నిలిచింది. ఏప్రిల్‌జూన్ కాలంలో ప్రత్యర్థి సంస్థలు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంటే ఎక్కువగా రూ.10,900 కోట్ల ఆధాయాన్ని ఆర్జించింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఈ గణాంకాలను విడుదల చేసింది. సంస్థను ప్రారంభించిన మూడేళ్లలో కాలంలోనే జియో ఆదాయంలోనూ మేటిగా నిలవడం విశేషం. జియో తర్వాత భారతి ఎయిర్‌టెల్ రూ .10,701.5 కోట్లు, వోడాఫోన్-ఐడియా రూ .9,808.92 కోట్లు ఆదాయాన్ని ఆర్జించాయి. ఎయిర్‌టెల్ 24 సంవత్సరాల సంస్థ, జియో ప్రారంభించి కేవలం 3 సంవత్సరాలు మాత్రమే అవుతోంది.జియో సెప్టెంబర్ 2016 లో సేవలను ప్రారంభించింది. భారతి ఎయిర్‌టెల్ 1995 నుండి మార్కెట్లో ఉంది. గత ఏడాది ఆగస్టులో వోడాఫోన్,ఐడియా సెల్యులార్ విలీనంతో వొడాఫోన్‌ఇండియా ఏర్పడింది. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ప్రకారం, రిలయన్స్ జియో సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఎజిఆర్) 2018 ఏప్రిల్-జూన్ త్రైమాసికంతో పోలిస్తే 9 శాతం పెరిగింది. జియో ఎజిఆర్ మార్కెట్ వాటా 31.7 శాతానికి పెరిగింది. భారతి ఎయిర్‌టెల్ 30 శాతం నిలుపుకుంది. వొడాఫోన్-ఐడియా 28.1 శాతానికి తగ్గింది. పరిశ్రమ వర్గాల ప్రకారం, 14 సర్కిల్‌లలో ఎజిఆర్‌లో జియో ఉండగా, ఎయిర్‌టెల్ 3, వొడాఫోన్-ఐడియా 5 సర్కిల్‌లలో ఉన్నాయి.

About The Author