10 మాసాల్లో పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి: సీఎం శ్రీ కేసీఆర్


పాలమూరు ఎత్తిపోతల పథకం రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లా కోసం రూపొందించిన ప్రాజెక్టు అని సీఎం కేసీఆర్ తెలిపారు. వనపర్తిలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్ లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..కొన్ని ప్రగతి నిరోధక శక్తుల వల్ల ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని సీఎం కేసీఆర్ అన్నారు. జిల్లాకు మంచి ఫలితాలను ఇచ్చే పథకం పాలమూరు ఎత్తిపోతల పథకమని సీఎం వెల్లడించారు. ఈసారి అదృష్టం కొద్దీ కృష్ణాలో నీళ్లున్నాయి. రాబోయే రోజుల్లో అద్భుతాన్ని చూడబోతున్నామని సీఎం తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పథకం రాబోయే 10 మాసాల్లో పూర్తవుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గత పాలకుల అసమర్థత వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందని, మంచినీళ్ల కోసం మనం అనేకసార్లు కర్ణాటకను బతిమాలినం. దీనికి గోదావరిని కృష్ణాతో అనుసంధానం చేసుకోవడం ఒక్కటే మార్గం. నదుల అనుసంధానంపై ఏపీ సీఎం, నేను ఒక అభిప్రాయానికి వచ్చినమని సీఎం కేసీఆర్ తెలిపారు. నదుల అనుసంధానంపై ఇరురాష్ట్రాలు తగిన రీతిలో అగ్రిమెంట్ చేసుకుంటాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవడం వల్ల 570 టీఎంసీల నీళ్లు వాడుకోవడానికి వెసులుబాటు కలిగిందన్నారు. చంద్రబాబు నాయుడు కుంచిత మనస్తత్వంతో మాట్లాడుతున్నాడని సీఎం కేసీఆర్ మండపడ్డారు. గతంలో ఇదే చంద్రబాబు బాబ్లీ మీద గొడవపెట్టుకుని ఏమి సాధించలేదన్నారు. పరవాడ ప్రాజెక్టులతో గొడవపెట్టుకున్న చంద్రబాబు సాధించింది సున్నానని సీఎం ఎద్దేవా చేశారు. ఎక్కడ ప్రాజెక్టు కట్టినా గొడవ చేసి హంగామా క్రియేట్ చేశారన్నారు. కొన్ని కారణాల వల్ల, గత పాలకుల తెలివితక్కువ విధానాల వల్ల తెలంగాణకు నష్టం జరిగిందని.. కొంతమంది తెలివిలేని సన్నాసులు రాష్ట్రానికి ఏమీ చేయలేదని సీఎం కేసీఆర్ విమర్శించారు.

About The Author