వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపన గురించి సూచనలు సలహాలలు

ఆర్గనైజర్లు వినాయక విగ్రహ ప్రతిష్ట గురించి పోలీసు అనుమతి కొరకు ఈ క్రింది వెబ్ సైట్ లో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి

వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపన గురించి సూచనలు సలహాలు

  1. వినాయకుని ప్రతిష్టచాలనుకునే వారు సంభందింత పి యస్ నుండి ముందుగా అనుమతి అనుమతి కొరకు ఈ క్రింది వెబ్ సైట్ లో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని కమిషనర్ గారు సూచించారు http://police portal.tspolice.gov.in
  1. ఎలక్ట్రిసిటి డిపార్ట్మెంట్ వారి పర్మిషన్ తీసుకుని కరెంటు వాడాలి.      
  1. వినాయకుని మండపం రోడ్డు ప్రక్కన గాని ఖాళీ స్థలంలో గాని నిర్మించాలి. 
  1. విగ్రహం యొక్క స్టేజి కింద ఎలాంటి వస్తువులు ఉంచరాదు
  1. మండపాల వద్ద తగినంత సంఖ్యలో స్థానిక సత్ప్రవర్తన.  కలిగిన వాలంటీర్లను నియమించి భక్తులను క్రమబద్ధీకరించే విధంగా చూడవలెను.
  1. గణేష్ మండపాలను మంచి నాణ్యత కలిగిన వస్తువుల తో ఏర్పాటు చేయవలెను మండపం మూడు వైపులా టార్పాలిన్ తో కప్పవలెను.
  1. మండపాలకు నాణ్యత కలిగిన వైరుతో కరెంట్ కనెక్షన్ ఇవ్వవలెను.
  1. వివాదాస్పద ప్రదేశాలలో మండపాలు ఉండకూడదు.
  1. ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలిగించరాదు. 
  1. గణేష్ మండపం వద్ద ముగ్గురు వాలంటీర్లు 24 x7 తప్పకుండ కాపలా ఉండాలని ఉండాలని సూచించారు.
  1. మండపాలలో అసాంఘిక కార్యకలాపాలకు తావివ్వకుండదు.
  1. మండపాల వద్ద టపాకాయలను ఇతర మందుగుండు సామాగ్రిని ఉంచరాదు.
  1. మండపం దగ్గర పూజా సమయాలలో భక్తుల వాహనాలను సరైన పద్దతిలో పార్కింగ్ చేయాలి. 
  1. వినాయక విగ్రహాల కమిటీ మెంబర్ల పేర్లు అడ్రసు, సెలఫోన్ నంబర్లు పోలీసు స్టేషన్ లో ఇవ్వాలి. ఆన్ లైన్ లో అప్లై చేసుకున్న తర్వాత  వచ్చిన మొదటి పేజీలో వచ్చిన సమాచారాన్ని 2 x 2 సైజులో ఫ్లెక్సీ తయారుచేసుకొని మండపం ఎదురుగా ఉంచాలి.
  1. మహ్మదీయ ప్రార్ధన నమాజ్ సమయంలో లౌడ్.స్పీకర్లు వాడరాదు. 
  1. విగ్రహాల దగ్గర బాక్స టైప్ స్పీకర్లను మాత్రమే వాడాలి ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. 
  1. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉదయం 0600 గం: ల నుండి రాత్రి 10:00 వరకు స్పీకర్లను మాత్రమే వాడాలి, స్పీకర్ సౌండ్ మోతాదులో నే ఉండాలి, ఇతరులకు ఇబ్బంది కలుగకుండా చూడాలి, భక్తికి సంబంధించిన పాటలు మాత్రమే వేయాలి. 
  1. లౌడ్ స్పీకర్లు విద్యాలయాలకు, ఆసుపత్రులకు, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలకు ప్రార్థన మందిరాలకు, ఇబ్బంది కలిగే విధంగా ఉండరాదు.
  1. గణేష్ మండపము ఇనుప రేకులతో ఉండాలి చుట్టూ బ్యారికేటీంగ్ కట్టాలి. 
  1. మండపాల వద్ద వాటర్ డ్రమ్ము మరియు ఇసుక తప్పకుండా ఉంచవలెను.
  1. మద్యం సేవించకూడదు. మద్యం సేవించి మండపాల వైపు రాకూడదు,. మహిళల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలి. 
  1. మండపాలలో మరియు చుట్టూ తగినంత వెలుతురు ఉండేలా చూడాలి, విద్యుత్ కోత సమయాల్లో టార్చ్ లైట్లు  లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు విధిగా ఏర్పాటు చేసుకోవాలి. 
  1. రెచ్చగొట్టే పొస్టర్లు గాని, బ్యానర్లు గాని, కరపత్రాలను గాని పంచకూడదు, అంటించకూడదు. 
  1. మండపాల వద్ద కొత్త వ్యక్తులు సంచరించినచో మరియు ఎలాంటి సమాచారమైన పోలీసు వారికి విధిగా తెలియపరచాలి. 
  1. సోషల్ మీడియాలో వచ్చే అనవసర వదంతులను, పుకార్లు నమ్మరాదు. 
  1. విగ్రహ ప్రతిష్ట నుండి మొదలుకొని నిమజ్జనం వరకు సంబంధిత ఆర్గనైజర్స్ పూర్తి భద్యత వహించవలెను. 
  1. పెద్దలు నిర్ణయించిన తేదీ లోపల నిమజ్జనం పూర్తి చేయాలి. 
  1. విగ్రహాలు ఏర్పాటు చేసిన వారు మండపాల వద్ద విధిగా ఒకటి లేదా రెండు సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.

About The Author