బ్యాంకులకు సెప్టెంబర్ 1 నుంచి 7 కొత్త రూల్స్!
బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్. ఒక్కటో తేదీ వచ్చేసింది. దీంతో బ్యాంకుకు చెందిన పలు నిబంధనలు మారాయి. వీటిని ముందే తెలుసుకుంటే మంచిది. డిపాజిట్ల దగ్గరి నుంచి లోన్ల వరకు పలు అంశాల్లో మార్పు కనిపించింది.
ప్రధానాంశాలు:
మారిన బ్యాంక్ నిబంధనలు
రెపో లింక్డ్ రుణాలు అందుబాటులోకి
బ్యాంక్ టైమింగ్స్ మారే ఛాన్స్
రైతులకు రెండు వారాల్లోనే కిసాన్ క్రెడిట్ కార్డులు
ఎస్‌బీఐ గుడ్ న్యూస్.. బ్యాడ్ న్యూస్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
మీకు బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? అయితే మీరు కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. సెప్టెంబర్ 1 నుంచి బ్యాంకులకు సంబంధించిన పలు నిబంధనలు మారాయి. డిపాజిట్లు దగ్గరి నుంచి రుణాల వరకు కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. వీటి గురించి ముందుగా తెలుసుకొని ఉంటే.. మీకు కొంత ప్రయోజనం కలగొచ్చు.
సెప్టెంబర్ 1 నుంచి మారిన 7 అంశాలు..
Bank Timings
ప్రభుత్వ రంగ బ్యాంకుల టైమింగ్ మారే అవకాశముంది. దేశంలో సాధారణంగా బ్యాంకులు ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఇప్పుడు బ్యాంకులు ఉదయం 9 గంటలకు తెరిచే అవకాశముంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే 9 గంటలకే బ్రాంచ్‌లను తెరవాలన్ని బ్యాంకులను ఆదేశించింది.
Kisan Credit Card
బ్యాంకులు రైతులకు సెప్టెంబర్ 1 నుంచి కిసాన్ క్రెడిట్ కార్డులను కేవలం 15 రోజుల్లోనే జారీ చేయనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి బ్యాంకులను ఆదేశించింది.
SBI Home Loans
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రెపో లింక్డ్ హోమల్ లోన్స్‌ను అందిస్తోంది. ఈ తరహా రుణాలు అందిస్తున్న తొలి దేశీ బ్యాంక్ ఇదే. సెప్టెంబర్ 1 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వడ్డీ రేటు 8.05 శాతం నుంచి ప్రారంభమౌతోంది.