ఐసీయూలో బాలింతపై లైంగిక వేధింపులు..
ఐసీయూలో బాలింతపై లైంగిక వేధింపులు..
హైదరాబాద్ కార్పొరేట్ ఆస్పత్రిలో దారుణం..
ఐసీయూలో ఉన్న మహిళా రోగిపై ఓ వార్డుబాయ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ నగరానికి చెందిన 30ఏళ్ల మహిళ డెలివరీ కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. డెలివరీ అనంతరం మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆమెను ఐసీయూకు మార్చారు. అయితే అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న అచ్యుత్ రావ్ అనే వార్డ్‌బాయ్ ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్న ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కొద్దిరోజుల తర్వాత కోలుకున్న బాధితురాలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు