బెంగుళూర్ హై వే రోడ్డులో కారు బోల్తా…

 

విష్ణు కుటుంభ సభ్యులు

చిత్తూరు జిల్లా… పలమనేరు నియోజకవర్గ పరిధిలో గంగవరం మండలంలోని మామడుగు వద్ద ప్రమాదం  కారులో మంటలు చెలరేగాయి.

కారు అగ్నికి ఆహుతై ఐదుగురు సజీవదహనం.
వివరాల మేరకు తిరుపతి పట్టణానికి చెందిన యాదవ కాలనీ లో ఉండు విష్ణు తన సోదరిని బెంగళూరు పట్టణములో వదిలి తిరిగి రావడానికి శనివారం వేకువజామున పోలో కరు. నెంబర్

AP03.BM.7393. లో బయలుదేరి నట్లు తెలిసింది.
పలమనేరు పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో గల, గంగవరం మండలం, మామ డుగు వద్ద రాగానే కారులో నుండి ఉన్నట్టుండి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని మంటల నుండి బయట పడిన విష్ణు పోలీసులకు తెలిపారు.
ఒక్కసారిగా మంటలు ఉద్ధృతం కావడంతో కారులో ఉన్న ఐదు మంది సజీవదహనం కాగా , కొనఊపిరితో విష్ణు బయటపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
విషయం తెలుసుకున్న పలమనేరు, గంగవరం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విశ్వ ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది.
మంటల్లో విష్ణు భార్య, జనని, కొడుకు పవన్ రామ్, కుమార్తె సాయి ఆశ్రిత, బెంగుళూరులో ఉన్న విష్ణు సోదరి కళ, ఈమె కుమార్తె భాను తేజ, ప్రాణాలు కోల్పోయారు.
మృతులను పోలీసులు పలమనేర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు, ఈ సంఘటనపై దిగ్భ్రాంతికి గురైన జిల్లా ఎస్పీ వెంకట్ అప్పలనాయుడు, పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని జరిగిన సంఘటనపై స్థానిక పోలీస్ ని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ తెల్లవారుజామున రాకపోకలు తక్కువగా ఉన్న సందర్భంలో ఎక్కువ స్పీడ్ తో పోవడం వల్లనే కారు అదుపు తప్పి ఉంటుందని , అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ వాహనాల వెళ్లేటప్పుడు స్పీడ్ గా వెళ్లకుండా నెమ్మదిగా డ్రైవింగ్ చేయాల్సి ఉందని తెలిపారు. ఆయన వెంట పలమనేర్ డి.ఎస్.పి, ఆరిఫ్ పుల్ల ఖాన్, గంగవరం సిఐ రామ కృష్ణ చారి, ఎస్సై సుధాకర్ రెడ్డి,

About The Author