షాకింగ్‌గా గ్యాంగ్ లీడర్ కలెక్షన్లు.. నాని

నేచురల్ స్టార్ నాని హీరోగా, RX 100 ఫేమ్ కార్తీకేయ నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం సాధిస్తున్న తీరు వసూళ్ల పరంగా సానుకూలంగా ఉంది. మిశ్రమ స్పందన వ్యక్తమైనప్పటికీ నానిపై ఉండే క్రేజ్‌తో ఈ సినిమా ఓ రేంజ్ కలెక్షన్లను సాధిస్తున్నది. తొలి రోజు నాని రేంజ్‌కు తగ్గుకుండా మోస్తారు కలెక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో సాధించింది. వారాంతంలో ఈ చిత్రం రూ.15 కోట్లకు చేరువయ్యే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఎంత వసూలు చేసిందంటే…

తెలుగు రాష్టాల్లో గ్యాంగ్ లీడర్ గత రెండు రోజుల్లో మంచి కలెక్షన్లను సాధిస్తున్నది. నైజాంలో రెండో రోజున ఈ చిత్రం రూ.1.48 కోట్లు సాధించింది. దాంతో మొత్తంగా రూ.3.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా బిజినెస్ నైజాలో రూ. 8 కోట్ల మేరకు జరిగింది. ఎంసీఏ, జెర్సీ తర్వాత నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది.

ఇక సీడెడ్‌లో 3.60 కోట్ల మేర ప్రీ రిలీజ్ జరిగితే గత రెండు రోజుల్లో గ్యాంగ్ లీడర్ చిత్రం రూ.97 లక్షలు వసూలు చేయడం గమనార్హం. ఈ సినిమా రెండో రోజున సుమారు రూ.50 లక్షల వసూళ్లు సాధించింది. తొలి వారం తర్వాత డిస్ట్రిబ్యూటర్లకు సంతృప్తిని కలిగించే వసూళ్లకు చేరువ అవుతుందనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది.

ఇక ఆంధ్రాలో గ్యాంగ్ లీడర్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.10 కోట్లకుపైగానే జరిగింది. ఇక వైజాగ్‌లో ఈ చిత్రం రూ.49 లక్షలు, గుంటూరులో 25 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 26 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 18 లక్షలు, కృష్ణాలో రూ.25.80 లక్షలు, నెల్లూరులో రూ.0.10 లక్షలు సాధించింది. మొత్తంగా ఏపీ, తెలంగాణలో ఈ చిత్రం రూ.8.07 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి

ఐదుగురు మహిళలతో కూడిన ఓ గ్యాంగ్ తమ కుటుంబానికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవాలని, యువ రచయిత పెన్సిల్ పార్థసారథి అనే క్రైమ్ రచయితను కలుస్తారు. తమకు జరిగిన అన్యాయానికి ఎలా ప్రతీకారం తీర్చుకొన్నారనేది సినిమా కథ. మనం, హల్లో సినిమాలకు దర్శకత్వం వహించిన విక్రమ్ కే కుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం సెప్టెంబర్ 13న రిలీజ్ అయింది.

 

About The Author