మానవ హక్కుల ఉల్లంగణ పై పిర్యాదులు స్వీకరణ
తిరుపతి, : మానవ హక్కుల ఉల్లంగణపై సామాన్యప్రజలు పిర్యాదులు చేయడానికి వీలుగా జాతీయ మానవహక్కుల సంఘం 6 రకాల మాద్యమాల ద్వారా ఫిర్యాదు చేయడానికి వీలుకల్పించిందని సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి ఆర్డీఓ కనక నరసా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత ఆన్ లైన్ పోర్టల్ www.nhrc.nic.in / స్పీడ్ పోస్ట్ లేదా పోస్టుద్వారా / టోల్ ఫ్రీ నెంబర్ 14433 / మాదాద్ కార్యలయం నందు లిఖిత పూర్వకంగా / మానవహక్కుల రక్షకులు 98102 98900 కేంద్రకార్యాలయం / దేశవ్యాప్తంగా వున్న సాదారణ సేవాకేంద్రాలలో రూ.30/- లను రుసుముగా చెల్లించడం ద్వారా భాదితులు పిర్యాదులు చేసే సౌకర్యం కల్పించించిందని, పల్లె మరియు పట్టణ సామాన్యప్రజలు మానవ హక్కుల వుల్లంగణపై చేసే తమ పిర్యాదులు త్వరితగతిన పరిష్కరించుకునే వీలు కలుగుతుందని సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ ఆప్రకటనలో తెలియ జేశారు డివిజనల్ పి.ఆర్.ఓ.,తిరుపతి