వనపర్తి నియోజకవర్గంలో పుష్కలంగా వేరుశెనగ పంటలు…


సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సార్ కృషితో కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నియోజకవర్గంలోని కుంటలు చెరువులు జలకళను సంతరించుకున్నాయి. దానికితోడు ఈ యేడు వరుణ దేవుడు కరుణించి పుష్కలంగా వానలు కురిపిస్తున్నడు. అప్పుడే మాగి కాలం వచ్చేసింది. ఇంకేముంది…!! రైతన్నల ముఖాలలో ఆశలు అంతెత్తున ఎగిసిపడుతున్నయి. ఈ యేట వరి నాట్లలో ఏ విధంగా అయితే పాలమూరు రికార్డు సృష్టించిందో…. అదే రికార్డును ఈ మగికాలంలో వేరుశెనగ బుడ్డల సాగు లోను పాలమూరు తప్పకుండా రికార్డు సృష్టిస్తుంది….దానికి అనుగుణంగా ముందస్తు జాగ్రత్తలతో మంత్రి నిరంజన్ రెడ్డి సారు విత్తనాల లభ్యతలో, పంపిణీలో రైతన్నల కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈరోజు నిరంజన్ రెడ్డి సార్ వనపర్తి నియోజకవర్గంలోని గోపాల్ పేట మండలకేంద్రం ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో సబ్సిడీ వేరుశనగ (బుడ్డలు) విత్తనాల పంపిణీని కలెక్టర్ శ్వేతా మహంతి, జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి గార్లతో కలిసి ప్రారంభించడం జరిగింది.

About The Author