ప్రభుత్వపాలనలో నూతనాధ్యాయానికి నాంది పలికిన సీఎం జగన్…


పాలన అనగానే సహజంగానే తీవ్రమైన ఒత్తిళ్లు.. అనేక మంది సలహాలు సూచనలు, వీటినిమించిన సమ స్యలు, వీటన్నింటినీ అధిగమించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు… ఊపిరి సలపనంతగా పని.. ఇవన్నీ సర్వసాధారణం. వీటికితోడు ఒక సమస్య పరిష్కారం అయ్యేలోగానే మరో సమస్య తెరమీదికి రావడం.. వంటివి కూడా కామనే. అయితే, వీటిని పరిష్కరించే క్రమంలోనే అనేక ప్రభుత్వాలు.. అప్పటి వరకు ఉన్న షెడ్యూల్‌ను ఓవర్ టేక్ చేయడం అనేది కూడా కామన్‌గా మారిపోయింది. ఏ ప్రభుత్వంలోనైనా ఒత్తిళ్లు సహజంగానే ఉంటాయి.

ఈ క్రమంలో అనుకున్న పనిని.. అనుకున్న సమయానికి పూర్తి చేయడం, నిర్దేశిత సమయంలోగా చేస్తామని చెప్పిన పనులను వాయిదా వేయడం సహజంగా జరిగేదే. కానీ అందుకు భిన్నంగా జగన్ ఒక టైమ్ షెడ్యూల్ పెట్టుకుని, ఖచ్చితంగా అనుకున్న సమయానికి అనుకున్న పనిని, అనుకున్నట్టు చేయడం గమనార్హం. నిజానికి ఇచ్చిన మాట ప్రకారం నిర్ణయాలు తీసుకుంటూ పనులు చేస్తున్న ప్రభుత్వం ఖచ్చితంగా జగన్ ప్రభుత్వమే. దానికి ప్రత్యక్ష సాక్ష్యం గ్రామ సచివాలయాల ఉద్యోగ కల్పన. గ్రామసచివాలయాల విషయంలో సీఎం జగన్ చెప్పింది చెప్పినట్లు ఇచ్చిన తేదీల ప్రకారం పరీక్షలు నిర్వహించి ఒకేసారి లక్షా ఇరవైవేల ఉద్యోగాలు శాశ్వత ప్రాతిపదికన కల్పించడం రాజకీయ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం.

About The Author