సమాజ సేవ అంశంపై నవ సమాజ ఫెడరేషన్ సమావేశం

 తిరుపతి రూరల్ :మంగళవారం.  పేరూరు లోని   సాంఘిక హాస్టల్ నందు విద్యార్థులు మరియు సమాజ సేవ అంశంపైన నవ సమాజ ఫెడరేషన్ రాయలసీమ జోన్ అధ్యక్షులు మల్లతోటి నరేష్ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశం ముఖ్య అతిథులుగా NSF వ్యవస్థాపక అధ్యక్షులు నీరుగుట్టు నగేష్ గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలాజీ గారు* హాజరై వారు  మాట్లాడుతూ సమాజంలో విద్యార్థులు దేశ నవ నిర్మాణం లో భాగస్వాములు కావాలి సమాజం పట్ల ప్రతి ఒక్కరు బాధ్యతతో మెలగాలి సమాజం మనకేమిచ్చింది దానికన్నా సమాజానికి మనమేం చేసాం అన్న ఆలోచనతో ముందుకు వెళ్లి ప్రతి విద్యార్థి ఇ విద్య, వైద్య ,ఆరోగ్య, వాణిజ్య రంగాల్లో ముందుకు దూసుకుపోవాలని సూచించారు . అనంతరం నవ సమాజ ఫెడరేషన్  సిద్ధాంతాలకు ఆకర్షితులై అన్నా నా మేము సైతం నవసమాజ నిర్మాణంలో భాగస్వాములవుతున్నారు అని 22 మంది ముందుకు రావడం జరిగింది వారికి హాస్టల్ కన్వీనర్ గా వంశీ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వారు మాట్లాడుతూ మాకు అప్పజెప్పిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి పట్టణ అధ్యక్షులు సూర్య , ఆర్ట్స్ కాలేజ్ అధ్యక్షులు నగేష్ , ప్రసాద్ , రూపేష్ తదితరులు పాల్గొనడం జరిగింది  ఉద్యమ వందనాలతో.మీ మల్లతోటి నరేష్రాయలసీమ జోన్ అధ్యక్షులు .NSF

About The Author