ఆర్టీసీ ఎండి ఆకస్మిక బదిలీ…. రేపే ఎలక్ట్రిక్ బస్సుల ప్రీ బిడ్ భేటి…


ఏపీఎస్‌ ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సురేంద్ర బాబును గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. 1987 బ్యాచ్‌కు చెందిన ఈ ఐపీఎస్ అధికారిని..తక్షణం పోలీస్ డైరెక్టర్‌ జనరల్‌కు రిపోర్ట్‌ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేస్తూ.. ప్రస్తుతం రాష్ట్ర రవాణా, రోడ్డు అండ్‌ బిల్డింగ్స్‌ విభాగంలో ప్రిన్సిపల్‌ కార్యదర్శిగా ఉన్న ఎంటీ కృష్ణబాబుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఒడిదుడుకుల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీని ఓ గాడిలోకి పెట్టి సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న సురేంద్రబాబుపై ఆకస్మిక బదిలీ వేటు ఎందుకు పడిందనేది ఇపుడు ఆర్టీసీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది…

రేపే ప్రి బిడ్డింగ్‌ భేటీ…

రాష్ట్ర ప్రభుత్వం ఫేమ్‌ పథకం కింద 350 ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం ఇది వరకే టెండర్లు పిలిచింది. ఈనెల 11వ తేదీ నుంచి బిడ్లను #APSRTC స్వీకరిస్తోంది.ఈ బిడ్లకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే మెయిల్‌ ద్వారా పంపేందుకు ఈనెల 23 వరకు గడువు విధించారు. ఈ నెల 26 న విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లోని మెయిన్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో ప్రి బిడ్డింగ్‌ భేటీ ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది.

ఈ టెండర్‌కు సంబంధించి బిడ్డర్లకు ఉన్న సందేహాలను, ఆర్టీసీ ఉన్నతాధికారులు నివృతి చేయనున్నారు. ఈ సమాశం మరో 24 గంటల్లో ఉండగా.. ఇప్పటి వరకు ఈ మొత్తం ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబును ఎందుకు బదలీ చేసినట్లు? ఇంత ఈ పథకం ఏమిటీ? ఇందులో పాత్రధారులు, సూత్రధారులు ఎవరు?

అసలింతకీ ఈ #ఫేమ్ పథకం ఏమిటి…?

నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో.. కేంద్ర ప్రభుత్వం ఎలక్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తోంది.

ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యూఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ (హైబ్రిడ్‌ అండ్‌)ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఫేమ్‌) పథకం కింద దేశ వ్యాప్తంగా విద్యుత్‌ వాహనాలను ప్రవేశపెడుతోంది. ఈ పథకం క్రింద కొనుగోలు చేసిన బస్సులకు 60 శాతం సబ్సిడీని కేద్రం ఇస్తోంది. తొలి విడత గా 10 నగరాల్లో విద్యుత్‌ బస్సులను నడిపేందుకు టెండర్లను ఆహ్వానించి… బిడ్లను ఖరారు చేసింది. ఇందులో కొన్ని రాష్ట్రాలు బస్సులను గంపగుత్తగా కొనుగోలు చేశాయి. మరికొన్ని కిలో మీటరు చొప్పున ఏడాదికి కనీసం ఇన్ని కిలోమీటర్లకు, కనీస చార్జి చెల్లిస్తామని పేర్కొంటూ… మొత్తం ఎన్ని సంవత్సరాలు సేవలు అందించాలో నిర్ణయించి,ఖరారు చేసాయి.

తొలి విడతగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, జమ్మూ అండ్‌ కాశ్మీర్‌, అసోం రాష్ట్రాలు బస్సులను కొనుగోలు చేయగా, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు కిలో మీటరకు చార్జి చొప్పున కాంట్రాక్టులను ఖరారు చేశాయి.

మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు ఎలక్ట్రిక్‌ బస్సులను సరఫరా చేయడంతో పాటు, వాటిని నిర్వహణ కాంట్రాక్ట్‌ను హైదరాబాద్‌కు చెందిన #గోల్డ్‌స్టోన్‌‌ఇన్‌ఫ్రాటెక్‌_బీఎండీ కంపెనీల కన్సార్టియం దక్కించుకుంది. ఇందులో బీఎండీ చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ. గోల్డ్‌స్టోన్ ఇన్ఫ్రాటెక్ కంపనీ ప్రస్తుతం తన పేరును #ఒలెక్ట్రాగ్రీన్‌టెక్‌_లిమిటెడ్ గా మార్చుకొంది.

బస్సులు నడిపేందుకు గోల్డ్‌ స్టోన్‌ కోట్‌ చేసిన ధర (కిలోమీటరుకు) కర్ణాటకలో రూ.29.28 కాగా, తెలంగాణలో రూ.36 ఇది కూడా చాలా తక్కువ ధర అని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఈ టెండర్లు పూర్తయింది గత ఏడాది మార్చిలో. ఇపుడు 18 నెలల తరవాత ఫేమ్‌ స్కీమ్‌ రెండో విడత కింద బస్సులకు టెండర్లు పిలిచారు. తెలంగాణలో కిలో మీటరుకు రూ.36 లకు విద్యుత్‌ బస్సులు నడిపిన కంపెనీ ఈ సారి రూ. 40, కోట్‌ చేస్తుందని అనుకున్నా… ఏపీలో ఈసారి పిలుస్తున్న టెండర్ల విలువ దాదాపు రూ.2000 కోట్లు.

#కొసమెరుపు:-

ఒలెక్ట్రా కంపెనీలో మెజారిటీ వాటాదారు మరెవరో కాదు… పోలవరం ప్రధాన డ్యాం,జలవిద్యుత్ కేంద్రాల కాంట్రాక్టును రివర్స్ టెండరింగ్ లో దక్కించుకొన్న మేఘా సంస్థకు దగ్గరి చుట్టమే అనే వార్త పరిశ్రమలో గుప్పుమంటోంది….

#APSRTC #Surendra_Babu #APSRTC_VC_MD #YSRCP #ElectricBus

About The Author